రాత్రి 11.30 గంటలకు ఏం జరిగింది? ఆసక్తి పెంచుతున్న ‘సిగ్నల్ ఎట్ 11:30’!

ABN , Publish Date - Nov 10 , 2026 | 04:04 PM

సంతోష్ ప్రతాప్, భవ్య త్రిఖ, పూజిత పొన్నాడ నటించిన సిగ్నల్ ఎట్ 11:30 సినిమా ట్రైలర్, ఆడియో విడుదలయ్యాయి.

Signal at 11:30

సంతోష్ ప్రతాప్, భవ్య త్రిఖ. పూజిత పొన్నాడ, జయప్రకాష్, మునీష్ కాంత్ తదితరులు నటించిన చిత్రం 'సిగ్నల్ ఎట్ 11:30'. మలర్విళి నటేశన్ దర్శకత్వం వహించగా, శివాని సుబ్రమణి నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్, ఆడియో రిలీజ్ వేడుక తాజాగా నగరంలో జరిగింది. ఇందులో సినీ ప్రముఖులు ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, నిర్మాత ధనుంజయన్, నటుడు విదార్థ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రం గురించి దర్శకురాలు మలర్విళి నటేశన్ మాట్లాడుతూ.. 'ఒక వ్యక్తి జీవితంలో రాత్రి 11.30 గంటలకు సిగ్నల్ వద్ద ఎదురయ్యే సమస్యే ఈ కథ. ఈ చిత్రానికి సంగీతం చాలా ముఖ్యం. ఇమాన్ అద్భుతంగా సంగీతం అందించారు. సంతోష్, పూజిత, భవ్య ప్రతి ఒక్కరూ చాలా చక్కగా నటించారు' అని అన్నారు.

Updated Date - Nov 11 , 2026 | 10:06 AM