Thalaiva 173: రజనీకాంత్‌ 173.. దర్శకుడు అతనే..

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:36 PM

కోలీవుడ్‌ స్టార్‌ రజనీకాంత్‌ 173వ (Rajinikanth 173) చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది.


కోలీవుడ్‌ స్టార్‌ రజనీకాంత్‌ 173వ (Rajinikanth 173) చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్‌ వచ్చింది. విశ్వనాయకుడు కమల్‌ హాసన్‌ నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి దర్శకుడు ఖరారయ్యారు. ఇప్పటికే ఒకరిద్దరు దర్శకుడు ఈ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడీ అవకాశం యువ దర్శకుడు శిబి చక్రవర్తికి (Sibi chakravarthy) దక్కింది. ఈ విషయాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ ఫొటోను షేర్‌ చేసింది. ‘ప్రతి హీరోకు ఓ ఫ్యామిలీ ఉంటుంది’ అని రాసుకొచ్చింది.  

శిబి చక్రవరి  2022లో తీసిన ‘డాన్‌’ తమిళ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అనిరధ్‌  సంగీతం అందిస్తున్నారు. 2027 సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. అయితే మొదట ఈ చిత్రానికి సుందర్‌.సి దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించారు.  అనుకోని కారణాల వల్ల దర్శకత్వ బాధ్యతల నుంచి సుందర్‌ వైదొలిగిన సంగతి తెలిసిందే! 

Updated Date - Jan 03 , 2026 | 01:03 PM