'జైలర్ 2'లో షారుఖ్ ఖాన్?
ABN , Publish Date - Mar 11 , 2026 | 09:53 AM
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్-2’.
రజనీకాంత్ (Rajinikanth), దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ చిత్రం ‘జైలర్-2’ (Jailer 2). ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అతిథి పాత్రలో కనిపించ నున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది.
2023లో విడుదలైన జైలర్‌కు సీక్వెల్‌గా ఈ చిత్రం రూపుదిద్దు కుంటోంది. బాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం..ఈ సినిమాలో షారుఖ్ ప్రత్యేక పాత్రలో ఓ పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు.
ఈనెల చివరి వారంలో సెట్స్‌లోకి షారుఖ్ ఎంట్రీ ఇవ్వనున్నారనీ, ఎనిమిది రోజుల పాటు చిత్రీకరించనున్న సన్నివేశాలతో షూటింగ్ పూర్తవుతుందని ప్రచారం జరుగుతోంది.
కాగా, ‘జైలర్’లో శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి స్టార్ నటులు కథను మలుపు తిప్పే అతిథి పాత్రల్లో నటించారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా అలాంటి పాత్రనే పోషించనున్నట్లు సమాచారం.