ఒకే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు.. శశికుమార్ కొత్త ఫ్యామిలీ థ్రిల్లర్!
ABN , Publish Date - Oct 23 , 2026 | 10:23 AM
‘గరుడన్’, ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శశికుమార్ కొత్త చిత్రం ప్రారంభమైంది.
గరుడన్, టూరిస్ట్ ఫ్యామిలీ వంటి సినిమాలతో విజయవంతమైన హీరోగా గుర్తింపు సొంతం చేసుకున్న శశి కుమార్ (Sasikumar) మరో ఇంట్రెస్ట్రింగ్ చిత్రంతో రెడీ అవుతున్నాడు. తాజాగా ఆయన సరసన కొత్త చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. కోలీవుడ్‌లో నాణ్యమైన చిత్రాలను అందిస్తున్న ఆర్.రవీంద్రన్ నిర్మాణంలో ట్రైడెంట్ ఆర్ట్స్ 22వ చిత్రానికి శ్రీకారం చుట్టింది.
ఇందులో హీరోయిన్లుగా శ్వాసిక (Swasika), అంజలి నాయర్ (Anjali Nair), నందితా శ్వేత (Nandita Swetha) నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో నరేన్, హరిశంకర్, హరీస్ పెరాడి, తేనప్పన్, వయ్యాపురి, ఆనంద్ నాగ్, వసంతి గురు తదితరులు పోషిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రా నికి ప్రముఖ కన్నడ దర్శకుడు, గీత రచయిత హరి సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. చెన్నైలో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ వివిధ ప్రదేశాల్లో చేయనున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ, 'ఇది వినూత్నమైన ఫ్యామిలీ థ్రిల్లర్ జానర్. ప్రేక్ష కులు ఆస్వాదించేలా అందించబోతున్నాం. తమిళంలో నా తొలి సినిమా కోసం ట్రైడెంట్ ఆర్ట్స్, హీరో శశికుమార్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా, ఈ చిత్రానికి క్రిష్ జె నాగ్రేచా సహ నిర్మాత. సంజయ్ విజయరాఘవన్ క్రియేటివ్ ప్రొడ్యూసర్. 6 డైమన్షన్ ఫిలిమ్స్ సహకారంతో ట్రైడెంట్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.