'సర్దార్ -2' కోసం కార్తి త్యాగం!

ABN , Publish Date - Jun 10 , 2026 | 07:02 PM

'ఇదిరా డెడికేషన్ అంటే' అని అంటున్నారు కార్తి అభిమానులు. సినిమా కోసం ప్రాణం పెడుతున్న ఆ హీరోని చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇంతకీ ఏం చేశారు అనుకుంటున్నారా... అయితే ఈ స్టోరీ చదివేయండి.

Sardar 2

తమిళ స్టార్ హీరో కార్తి కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం 'సర్దార్-2'. పీఎస్ మిత్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ పూర్తై నెలలు గడుస్తున్నా రిలీజ్ డేట్‌పై క్లారిటీ లేక ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇలాంటి టైమ్‌లో సినిమాటోగ్రాఫర్ జార్జ్ సి విలియమ్స్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతూ సినిమాపై హైప్‌ను పెంచాయి.


'సర్దార్ -2' తన కెరీర్‌లోనే అతి పెద్ద సినిమా అని... 8 భారీ సెట్లు, 15 నెలల షూటింగ్ జరిగిందని చెప్పుకొచ్చాడు విలియమ్స్. 'సర్దార్-2' సాధారణ సీక్వెల్ కాదని.. మొదటి భాగాన్ని మించి భారీ స్థాయిలో ఉందని రివీల్ చేశాడు. ముఖ్యంగా ఎయిర్‌క్రాఫ్ట్ ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ తో థియేటర్లు దద్దరిల్లిపోతాయని తెలిపారు. ఇక కార్తి డెడికేషన్‌పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించాడు. కార్తి వృద్దుడి పాత్ర కోసం 6 గంటలు మేకప్‌ కు కేటాయిస్తే... ఆ తర్వాత ఆ లుక్‌తో 12 గంటల పాటు షూటింగ్ చేశాడని కొనియాడాడు.

ప్రస్తుతం 'సర్దార్- 2' ఎడిటింగ్, సీజీ వర్క్ జరుగుతోంది. మొదటి భాగం హిట్ కావడంతో 'సర్దార్ -2'కి తమిళ, తెలుగు, హిందీలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందులోని యాక్షన్ ఎపిసోడ్స్, ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్‌ అందరినీ అలరిస్తాయని అంటున్నారు. ఈ మూవీ కార్తి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇటీవల కార్తికి సరైన హిట్ లేకపోవడంతో ఈ సినిమా విజయం ఆయనకు కీలకం కానుంది. ఇప్పుడు జార్జ్ విలియమ్స్ చేసిన కామెంట్స్‌తో కార్తి కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళే సినిమా ఇదవుతుందని అటు ఫ్యాన్స్ ఇటు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

భారతీరాజా అంత్యక్రియల్లో తీవ్ర కలకలం.. బంధువులపై సింగర్ ఆగ్రహం

Drishyam 3: అందుకే.. వెంక‌టేశ్‌తో దృశ్యం 3 రీమేక్ చేయలేదు! అస‌లు గుట్టు.. బ‌య‌ట పెట్టిన డైరెక్ట‌ర్‌

‘పెద్ది’ మైండ్ బ్లోయింగ్ స్ట్రాటజీ! నార్త్, ఓవర్సీస్‌లో ఇక తిరుగులేనట్టే!

Updated Date - Jun 10 , 2026 | 07:12 PM