కన్నడ నటిపై అత్యాచారం.. నిందితుడి అరెస్టు
ABN , Publish Date - Aug 14 , 2026 | 06:36 AM
శాండల్‌వుడ్ నటిపై అత్యాచారం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలపై చంద్రా లే అవుట్ పోలీసులు రాఘవేంద్రను అరెస్ట్ చేశారు. ఇదే వ్యవహారంలో నటి సోదరిపై రాఘవేంద్ర తల్లి ఫిర్యాదు చేసింది.
తాజాగా ఓ శాండల్ వుడ్ నటిపై అత్యాచారం జరిగినట్లు చంద్ర లే అవుట్ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రాఘవేంద్రను అరెస్టు చేశారు. ఇదే వివాదంలో నటి సోదరిపై రాఘవేంద్ర (Raghavendra) తల్లి తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి సోదరి తనకు ఫోన్ చేసి బెదిరించారని, అంతుచూస్తామని హెచ్చరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
నటికి చెందిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను ఉంచుకుని రాఘవేంద్ర బ్లాక్మెయిల్ చేశాడని, అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇదే విషయమై నటి సోదరి నేరుగా రాఘవేంద్ర తల్లికి ఫోన్ చేసి బెదిరించినట్లు సమాచారం. (Sandalwood News)
ఫిర్యాదు చేసిన నటికి, రాఘవేంద్రకు మధ్య సంబంధం ఏమిటి, వివాదం ఏమిటి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నటి ఫిర్యాదు మేరకు రాఘవేంద్రపై అత్యాచారం కేసు నమోదు చేశామని, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చంద్రా లే అవుట్ పోలీసులు తెలిపారు.