సంగీత సామ్రాజ్ఞి పాత్రలో రుక్మిణీ వసంత్!

ABN , Publish Date - Apr 27 , 2026 | 12:39 PM

మొన్నటి వరకూ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మీగా సాయిపల్లవి నటించబోతోందనే వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆమె స్థానంలో రుక్మిణీ వసంత్‌ ఆ పాత్రను చేస్తోందని అంటున్నారు.

MS Subbulakshmi biopic

'జెర్సీ' ఫేమ్‌ గౌతమ్ తిన్ననూరి రూపొందించబోతున్న సంగీత సామ్రాజ్ఞి ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మీ (MS Subbulakshmi) బయోపిక్‌లో సాయిపల్లవి (Saipallavi) నటించబోతోందనే వార్త కొంతకాలంగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలానే ఆమె పేరుతో పాటు నయనతార (Nayantara) పేరు కూడా ఆ మధ్య వినిపించింది. అలా మరో ఇద్దరు ముగ్గురి పేర్లనూ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మీ పాత్రతో ముడి పెట్టి కొందరు ప్రచారం చేశారు. అయితే ఫైనల్‌గా సాయిపల్లవి దగ్గరే అది ఆగింది. కానీ ఇప్పుడు ఆ పాత్ర సాయి పల్లవి చేజారి... రుక్మిణీ వసంత్‌ (Rukmini Vasanth) ను చేరిందని వార్తలు వస్తున్నాయి.


సాయిపల్లవికి ఈ పాత్ర చేయాలనే కోరిక బలంగా ఉన్నా... ఇప్పటికే ఆమె కమిట్‌ అయిన సినిమాల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ పాత్రను వదిలేసుకుందని అంటున్నారు. ఇదిలా ఉంటే... పలు కన్నడ, తెలుగు సినిమాలతో ఇప్పటికే దక్షిణాది సినీ అభిమానుల గుండెల్లో చోటు దక్కించుకున్న రుక్మిణి వసంత్ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మి బయోపిక్‌లో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'కాంతార: చాప్టర్‌ 1'తో రుక్మిణీ వసంత్‌ సైతం జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె యశ్‌ మూవీ 'టాక్సిక్‌'లో నటిస్తోంది. అలానే ప్రభాస్ సరసన 'డ్రాగన్‌' చేస్తోంది. తమిళంలోనూ ధనుష్‌ మూవీలో రుక్మిణీ వసంత్ ఎంపికైందని వార్తలు వచ్చాయి. కెరీర్‌ మంచి ఊపు మీద ఉన్న ఈ సమయంలో ఆమె ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మీ పాత్రను చేస్తే ఖచ్చితంగా అది ప్రాజెక్ట్‌కు ఉపయోగపడే అంశమే! అయితే రుక్మిణీ వసంత్‌ ఎమ్మెస్‌ సుబ్బులక్ష్మిగా నటించబోతోందనే విషయాన్ని ఇంకా అధికారికంగా మేకర్స్ ప్రకటించలేదు.

Updated Date - Apr 27 , 2026 | 12:40 PM