Toxic: ఐదుగురు హీరోయిన్లు.. ఇంతేనా ఇంకెవరైనా మిగిలారా
ABN , Publish Date - Jan 06 , 2026 | 03:08 PM
కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు కన్నడ నటుడు యశ్ (Yash). ఈ సినిమా తరువాత కెజిఎఫ్ 2 సినిమాతో వచ్చి తెలుగునాట కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
Toxic: కెజిఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు కన్నడ నటుడు యశ్ (Yash). ఈ సినిమా తరువాత కెజిఎఫ్ 2 సినిమాతో వచ్చి తెలుగునాట కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాల తరువాత యశ్ మరో సినిమాను ప్రకటించడానికి ఏళ్ళు పట్టింది. స్టార్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అతని చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. ఇక వారందరిని కాదని లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి ఛాన్స్ ఇచ్చాడు యశ్. ఆ సినిమానే టాక్సిక్ (Toxic).
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి కొన్ని రోజులుగా హీరోయిన్ల పోస్టర్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. సాధారణంగా ఒక సినిమాలో ఒకరు లేక ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. చాలా రేర్ సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కానీ, యశ్ టాక్సిక్ లో మాత్రం ఇప్పటివరకు ఐదుగురు హీరోయిన్లు ఉన్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియా.. తాజాగా రుక్మిణి వసంత్ కూడా ఇందులో చేరింది. ఆమె మెలినా అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో రుక్మిణి ఎంతో అందంగా కనిపించింది.

ఇక ఈ పోస్టర్స్ అన్ని చూశాక అభిమానులు అసలు ఏం సినిమా తెరకెక్కిస్తున్నారు? ఐదుగురు హీరోయిన్లతో యశ్ ఏం చేస్తున్నాడు.. ? అందరూ యాక్షన్ సీక్వెన్స్ లలో పాల్గొన్నట్లే కనిపిస్తున్నారు. ఇంతేనా.. ఇంకేవేరైనా ఉన్నారా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మార్చి 19 న ఈ సినిమా ప్రేక్షకుల ముందు రానుంది. మరి ఈ సినిమాతో యశ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.