RJ Balaji: 'బాహుబలి'లో.. ఛాన్స్ మిస్ అయ్యా
ABN , Publish Date - May 04 , 2026 | 05:42 PM
బాహుబలి మొదటి భాగంలో పనిచేసే అవకాశాన్ని కోల్పోయానని దర్శకుడు ఆర్జే బాలాజీ వెల్లడించారు.
దర్శకుడు రాజమౌళి (S. S. Rajamouli) రూపొందించిన బాహుబలి (Baahubali) మొదటి భాగంలో పనిచేసే అవకాశాన్ని కోల్పోయానని దర్శకుడు ఆర్జే బాలాజీ వెల్లడించారు. రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ఆర్జే బాలాజీ (RJ Balaji) ఇపుడు దర్శకుడిగా పలువురు అగ్రహీరోలతో సినిమాలు తీస్తు మంచి డైరెక్టర్‌గా గుర్తింపు పొందాడు. లేటెస్ట్‌గా స్టార్ హీరో సూర్యతో కురప్పు (తెలుగులో వీరభద్రుడు) అనే సినిమాను తెరకెక్కించగా ఈ చిత్రం ఈ నెలలోనే ప్రేక్షకుల ఎదుటకు రానుంది.
ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'బాహుబలి' మొదటి భాగం తమిళ వర్షన్‌కు మాటలు రాసే అవకాశం మదన్ కార్గికి వచ్చింది. ఆ సమయంలో మదన్ కార్గి నన్ను పిలిచి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటికి కుమారుడిగా నటించిన అడవి శేష్ పాత్రకు వాయిస్ ఓవర్ ఇవ్వాలని కోరగా, అంగీకరించాను. మళ్ళీ రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి, నా వాయిస్ సరిపోదని రాజమౌళి చెప్పారని తెలిపారు. అలా 'బాహుబలి' చిత్రానికి పనిచేసే అవకాశాన్ని కోల్పోయాను' అని వివరించారు.