Rishab Shetty: 'స్పైడర్-మ్యాన్' గురించి రిషబ్ శెట్టి ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 27 , 2026 | 10:37 AM
జాతీయ అవార్డు గ్రహీత, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) తనకు చిన్నప్పటి నుంచే స్పైడర్-మ్యాన్ పాత్రపై ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు.
జాతీయ అవార్డు గ్రహీత, నటుడు-దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) తనకు చిన్నప్పటి నుంచే స్పైడర్-మ్యాన్ పాత్రపై ప్రత్యేకమైన అభిమానం ఉందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' (Spider-Man: Brand New Day సినిమా విడుదల సందర్భంగా మార్వెల్ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమంలో రిషబ్ సందడి చేశారు. ఈ సందర్భంగా స్పైడర్-మ్యాన్‌పై తనకున్న అనుబంధాన్ని అభిమానులతో పంచుకున్నారు.
'చిన్నతనంలో సింగిల్ స్క్రీన్ థియేటర్‌లో తొలిసారి స్పైడర్-మ్యాన్ చిత్రాన్ని చూసిన క్షణం ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ సినిమాలోని పీటర్ పార్కర్ పాత్ర ఎంతగానో ఆకట్టుకుంది, సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ హీరోగా ఎదిగే అతని ప్రయాణం నను ఎంతగానో ప్రేరేపించింది. జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎలాంటి తప్పులు జరిగినా మనలోని మంచితనాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని పీటర్ పార్కర్ పాత్ర నేర్పింది. 'అత్యధిక శక్తి ఉన్నవారికి అత్యధిక బాధ్యత కూడా ఉంటుంది' అనే సందేశం స్పైడర్-మ్యాన్ పాత్రను మరింత ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇప్పుడు నా పిల్లలు కూడా స్పైడర్-మ్యాన్‌కు పెద్ద అభిమానులే. కుటుంబంతో కలిసి 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమాను థియేటర్‌లో చూసేందుకు ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్నాము., అందరం కలిసి ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని రిషబ్ చెప్పారు. టామ్ హాలండ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జూలై 30న భారతదేశంలో విడుదల కానుంది. ఇంగ్లీష్‌తో పాటు హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.