Rishab Shetty: రిషబ్ రేంజ్ మారింది.. పారితోషికం ఆకాశాన్ని అంటింది

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:04 PM

'కేజీఎఫ్‌', 'కాంతార' చిత్రాలతో కన్నడ సినిమాలకి మంచి క్రేజ్ పెరిగింది. కన్నడ మేకర్స్ సినిమాను చూట్టేస్తారు అనే మాట ఈ  రెండు చిత్రాలతో చెరిగిపోయింది.

'కేజీఎఫ్‌', 'కాంతార' (Kantara) చిత్రాలతో కన్నడ సినిమాలకి మంచి క్రేజ్ పెరిగింది. కన్నడ మేకర్స్ సినిమాను చూట్టేస్తారు అనే మాట ఈ  రెండు చిత్రాలతో చెరిగిపోయింది. ఇప్పుడు అక్కడ కూడా భారీ బడ్జెట్, పాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. హీరోల పారితోషికాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. య‌శ్‌, రిష‌బ్ శెట్టి లాంటి స్టార్లు పాన్ ఇండియా  స్థాయిలో గుర్తింపు పొందటంతో వాళ్ల పారితోషికాలు  ఊహ‌కు అంద‌నంత పెరుగుతున్నాయి. ‘కేజీఎఫ్‌’ త‌ర‌వాత య‌శ్ (Yash)గ్రాఫ్  పూర్తిగా మారిపోయింది. ‘కేజీఎఫ్ 2’ కోసం దాదాపు రూ.50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని టాక్. ‘టాక్సిక్‌’ కోసం అటూ ఇటుగా రూ.75 కోట్లు అని శాండల్ వుడ్లో వార్తలు వస్తున్నాయి.  ఇప్పుడు రిష‌బ్ శెట్టి (Rishab Shetty) కూడా ఈ మార్క్ కు చేరుకొన్నాడు.

తెలుగులో తెరకెక్కుతున్న ‘జై హ‌నుమాన్’ సినిమా కోసం రిష‌బ్ రూ.80 కోట్లు డిమాండ్ చేశాడ‌ని తెలుస్తోంది. య‌శ్ తో సితార సంస్థ ఓ చిత్రాన్ని కమిట్ అయింది.  అశ్విన్ గంగ‌రాజు దీనికి ద‌ర్శ‌కుడు. ఈ సినిమాకూ అటూ ఇటుగా రూ.80 కోట్లు డిమాండ్ చేసాడని తెలుస్తోంది. ‘కాంతార‌’ తో రిష‌బ్ కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ద‌క్కింది. ‘కాంతార 2’ దాదాపు రూ.300 కోట్లు సాధించింది. అందుకే ఇప్పుడు రిష‌బ్ శెట్టి పారితోషికం కూడా రెట్టింపు అయ్యిందని టాక్. ‘కాంతార‌’ తో  రిష‌బ్ శెట్టి కి తెలుగులో మార్కెట్, అభిమానుల సంఖ్య పెరిగింది. అతని చిత్రాలకు మంచి  ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. దాంతో నిర్మాత‌లు కూడా రిష‌బ్ అడిగినంత ఇవ్వ‌డానికి రెడీ అవుతున్నార‌ని ఫిలిం నగర్లో వినిపిస్తోంది. 

తాజాగా తెరకెక్కుతున్న  ‘జై హ‌నుమాన్‌’ బ‌డ్జెట్ రూ.200 కోట్ల‌కు పైగా బడ్జెట్ తో రూపొందుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో  తెర‌కెక్కుతున్న సినిమా కూడా పెద్ద బ‌డ్జెట్ సినిమానే. ఈ రెండింటిలో ‘జై హ‌నుమాన్‌’ ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశం ఉంది. ఈ రెండు సినిమాల్లో ఏది  హిట్ అయినా రిష‌బ్ రూ.100 కోట్ల హీరోల జాబితాలో చేరిపోతాడు. అదే  జరిగితే .100 కోట్ల పారితోషికం అందుకొన్న తొలి క‌న్న‌డ హీరోగా  రిషబ్ పేరు  నిలిచిపోతుంది.

Updated Date - Feb 03 , 2026 | 12:10 PM