Ravi Mohan: నా భార్య నరకం చూపిస్తోంది.. నా ప్రాణం పోయింది

ABN , Publish Date - May 16 , 2026 | 05:35 PM

తన భార్య నరకం చూపిస్తోందని, తన పిల్లలను కలవనివ్వడం లేదని కోలీవుడ్ హీరో రవి మోహన్ (Ravi Mohan) కన్నీరు పెట్టుకున్నాడు. గత కొన్ని నెలలుగా రవి మోహన్.. తన భార్య ఆర్తి దగ్గర నుంచి విడాకులు కావాలని పోరాడుతున్న విషయం తెల్సిందే.

Ravi Mohan

తన భార్య నరకం చూపిస్తోందని, తన పిల్లలను కలవనివ్వడం లేదని కోలీవుడ్ హీరో రవి మోహన్ (Ravi Mohan) కన్నీరు పెట్టుకున్నాడు. గత కొన్ని నెలలుగా రవి మోహన్.. తన భార్య ఆర్తి దగ్గర నుంచి విడాకులు కావాలని పోరాడుతున్న విషయం తెల్సిందే. ఆర్తి మాత్రం విడాకుల గురించి తనతో చర్చించకుండానే సోషల్ మీడియాలో రవి చెప్పాడని, తనకు విడాకులు ఇవ్వడం ఇష్టంలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రవి - ఆర్తి విడాకుల కేసు కోర్టులో ఉంది. విడాకులు రాకముందే రవి .. సింగర్ కెనీషాతో రిలేషన్ లో ఉండడం మరింత చర్చనీయాంశంగా మారింది.


రవి - కెనీషా టెంపుల్స్ కి ఫంక్షన్స్ కి కలిసి వెళ్ళడంతో రవి- ఆర్తిలు విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె అని సోషల్ మీడియాలో విమర్శలు తలెత్తాయి. వాటిని తట్టుకోలేక కెనీషా చెన్నై నుంచి రవి జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నట్లు ప్రకటించింది. వెంటనే రవి మోహన్ సైతం గత కొన్నినెలలుగా తాను అనుభవిస్తున్న నరకాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నానని, కుటుంబ సమస్యల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడ్డానని తెలిపాడు. తన సంపాదన, వ్యక్తిగత నిర్ణయాల విషయంలో కూడా తాను స్వేచ్ఛగా ఉండలేకపోయానని చెప్పాడు.


' నా భార్య నాకు నరకం చూపిస్తోంది. పిల్లలను నా దగ్గరకు పంపడం లేదు. స్కూల్ కి సైతం బాడీగార్డ్స్ ని ఇచ్చి పంపిస్తోంది. కనీసం నా ఫోన్ కాల్ కూడా వారికి చేరనివ్వడం లేదు. 16 ఏళ్ళు నాతో కలిసి ఉన్నప్పుడు నన్ను దేవుడు అన్న ఆమె.. ఇప్పుడు నాపై నిందలు వేస్తోంది. నేనెప్పుడూ న కుటుంబం కోసమే పని చేసాను. ఇప్పటివరకు నాకు పర్సనల్ గా అకౌంట్ అనేది లేదు. జాయింట్ అకౌంట్ నుంచి చిన్న మొత్తం డ్రా చేసినా ఎందుకు తీసావు అంటూ టార్చర్. సెలబ్రిటీలకు ఇలా అంటే అలా విడాకులు వచ్చేస్తున్నాయి. కానీ, నాకు రాలేదు. ఎందుకంటే డబ్బు.. ఆమె అలా చేస్తోంది.


సోషల్ మీడియాలో నా మీద ట్రోలింగ్ చేయడానికి పీఆర్ టీమ్ ని పెట్టించింది. దీనివలన నేను చాలా ఒత్తిడికి లోనయ్యాను. నాతోపాటు నా స్నేహితురాలు కెనీషాను ఇబ్బంది పెట్టారు. ఆమెను ఎంతో వేధించారు. నా ఫ్రెండ్ ను నా నుంచి దూరం చేశారు. నా ప్రాణం పోయింది. ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

Updated Date - May 16 , 2026 | 06:22 PM