కార్మేని సెల్వం: అప్పుల్లో ఉన్నవారికి ధైర్యాన్నిచ్చే చిత్రం 

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:54 PM

విలక్షణ నటులు సముద్రఖని ప్రధాన పాత్ర పోషించిన  చిత్రం ‘కార్మేని సెల్వం’.  గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.  


విలక్షణ నటులు సముద్రఖని (Samuthirakani) ప్రధాన పాత్ర పోషించిన  చిత్రం ‘కార్మేని సెల్వం’ (carmeni selvam).  గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన  ఈ  సినిమా  ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.  పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా  ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్ చక్రి మీడియాతో మాట్లాడారు. 


 
'నేను తెలుగులో చూసిన మొదటి సినిమా ‘ఆర్య’. ఆ తర్వాత ఆనంద్, గోదావరి మూవీస్ చూశ.  అప్పుడు నాకు ఒక విషయం బాగా అర్థమైంది.  తెలుగు సినిమా ఇండస్ట్రీలో రెండు భిన్నమైన కథల శైలులను ఎంతో అద్భుతంగా స్వీకరిస్తుంది. ఒక వైపు ఆర్య లాంటి ఎనర్జిటిక్, కమర్షియల్ సినిమాలు ఉంటే, మరో వైపు శేఖర్ కమ్ముల తీసిన ఆనంద్, గోదావరి లాంటి హృదయాన్ని తాకే రియలిస్టిక్ కథలు ఉంటాయి. ఆ బ్యాలెన్స్ నాకు చాలా ఇన్‌స్పిరేషన్ ఇచ్చింది.  

‘కార్మేని సెల్వం’ మధ్య తరగతి జీవితంపై ఆధారంగా తెరకెక్కింది. సినిమా చూసిన  ప్రతి ఒక్కరూ కథతో కనెక్ట్ అవుతారు. ముఖ్యంగా అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి ఈ సినిమా ఒక ధైర్యాన్ని ఇస్తుంది. మధ్య తరగతి కుటుంబాల్లో అప్పులు అనేవి కామన్‌. వాటి కారణంగా కుటుంబంలో సంబంధాలు, వారు తీసుకునే నిర్ణయాలు ఎలా ప్రభావితం చేస్తాయనేది ఇందులో చూపించబోతున్నాం. రియలిస్టిక్‌గా మూవీ ఉంటుంది.  సముద్రఖని గారు ఆయన పాత్రలోని ప్రతి షేడ్‌ను  అద్భుతంగా పండించారు. మధ్యతరగతి భర్తగా, తండ్రిగా తనదైన ఎమోషన్‌ను పండించారు. ఆయనతోపాటు గౌతమ్ మీనన్ గారు, లక్ష్మీ ప్రియా, అభినయ పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మా టెక్నికల్ టీమ్ కూడా ఎంతో సపోర్ట్‌ చేసింది.  ‘మ్యూజిక్ యాజ్ ఎ సర్వీస్’ పేరుతో  మా మ్యూజిక్ డైరెక్టర్ రామానుజన్ టీమ్ వర్క్ చేశారు.  సంగీతం అనేది కేవలం మ్యూజిక్ డైరెక్టర్ లేదా సింగర్స్‌దే కాదు.. ఇన్‌స్ట్రుమెంటలిస్టులు, సౌండ్ ఇంజినీర్లు, మిక్సింగ్ టీమ్, ఇంకా ఎంతో మంది టెక్నీషియన్లు కలిసి చేసే పనిగా వారు భావించారు. ఈ కాన్సెప్ట్ ద్వారా ప్రతి పాటకు పని చేసిన అందరికీ క్రెడిట్ ఇవ్వడం, అలాగే రెవెన్యూ షేర్ చేయడం మా లక్ష్యం. ఇది మ్యూజిక్ వెనుక ఉన్న అసలు హీరోలకు గుర్తింపు ఇవ్వడానికి మా చిన్న ప్రయత్నం. థియేటర్‌లో ఈ సినిమా విజువల్స్ చూస్తే, కథను ఎంత గ్రాండ్‌గా తీసుకెళ్లామో అర్థమవుతుంది. ఈ కథపై నమ్మకం ఉంచి, మంచి క్వాలిటీతో సినిమా చేయడానికి నిర్మాత ఎంతో  సహకరించారు. కుటుంబంలో పెద్దలు కొందరు విదేశాల్లో జీవనోపాధి కొనసాగిస్తున్నారు.  కానీ వారి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయి. ఏడాదికి కనీసం ఒకట్రెండు సార్లు అయినా  వారు తిరిగి వచ్చి తమ కుటుంబాలతో కలవాలని ఈ సినిమాతో జనాలకు చెప్పాలనుకుంటున్న. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకు ఈ చిత్రం బాగా కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు. 

Updated Date - Apr 02 , 2026 | 12:01 AM