మైసూరులో.. ఆటోలో తిరిగిన రజనీకాంత్
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:30 PM
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాచనగరి మైసూరులో సందడి చేశారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) రాచనగరి మైసూరు (Mysuru)లో సందడి చేశారు. ధర్మాన్ (Dharman) సినిమా షూటింగ్‌లో భాగంగా ఆయన రెండు రోజులుగా మైసూరులో ఉంటున్నారు. సినిమా షూటింగ్ సెట్‌కు మంగళవారం రజనీ కాంత్ ఆటోలో వచ్చారు. ఆయన్ని చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు.
ఆటోలోనుంచి అభిమానులకు దిగి అభివాదం చేస్తూ షూటింగ్‌కు వెళ్ళారు. ఆపై చాముండేశ్వరి దేవి (Sri Chamundeshwari Temple) ని దర్శించుకున్నారు. ఉదయం చాముండి కొండపైకి రజనీకాంత్ చేరుకోగా అభిమానులతో పాటు స్థానికులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. చాముండేశ్వరి దేవిని చాలాకాలం తర్వాత దర్శించుకున్నానని, సంతోషంగా ఉందని అన్నారు.
ఇదిలాఉంటే.. ఈ సినిమాలో తెలుగు స్టార్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) కీలక పాత్రలో నటిస్తుండగా తెలుటమ్మాయి శ్రీలీల (Sreeleela), రాశీ ఖన్నా (Raashii Khanna) కథానాయికలుగా నటిస్తున్నారు. డ్రాగన్ ఫేం అశ్వత్ మారిముత్తు (Ashwath Marimuthu) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ఎదుటకు రానుంది.