బాలయ్య నో.. షారుఖ్ నో.. నెల్సన్ స్పెషల్‌ గెస్ట్‌ ఎవరు..

ABN , Publish Date - Apr 09 , 2026 | 02:06 PM

ఒక బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుసగా ఫ్లాపులను అందుకున్నాడు. వరుస ఫ్లాపులు పడడంతో రజనీ పని అయిపోయింది అనుకున్న టైమ్‌లో.. జైలర్ సినిమాతో కోలీవుడ్‌ రికార్డులను షేక్ చేశారు తలైవా.

ఒక బాక్సాఫీస్‌ వద్ద సంచలనాలు సృష్టించిన సూపర్‌స్టార్ రజనీకాంత్ వరుసగా ఫ్లాపులను అందుకున్నాడు. వరుస ఫ్లాపులు పడడంతో రజనీ పని అయిపోయింది అనుకున్న టైమ్‌లో.. జైలర్ సినిమాతో కోలీవుడ్‌ రికార్డులను షేక్ చేశారు తలైవా. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మేకింగ్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌, ఇంకా రజనీ మేనరిజమ్స్ సినిమాను 600 కోట్ల క్లబ్‌లో చేర్చాయి. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు వేట్టయాన్‌, కూలీ సినిమాలు మళ్లీ ఫ్లాపయ్యాయి. దీంతో ఇప్పుడు అందరి కళ్ళూ Jailer-2 పైనే ఉన్నాయి. ఫస్ట్ పార్ట్ సాధించిన సక్సెస్ ఒక ఎత్తు అయితే, సెకండ్ పార్ట్ కోసం నెల్సన్ పడుతున్న కష్టాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.

జైలర్ మొదటి భాగం అంత పెద్ద హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్.. క్లైమాక్స్‌లో వచ్చే గెస్ట్ అప్పీయరెన్స్‌లు. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలు స్క్రీన్ మీద కనిపించగానే థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని నెల్సన్ జైలర్‌-2 ను మరింత భారీగా ప్లాన్ చేశారు. ఈ సెకండ్ పార్ట్ షూటింగ్ దాదాపుగా ఫినిషింగ్ స్టేజ్‌కు వచ్చేసింది. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ తమ పోర్షన్స్‌ను కంప్లీట్ కూడా చేసేశారు. కానీ నెల్సన్ టార్గెట్ ఇంకా పెద్దది. ఈసారి సినిమాలో మరికొంత మంది బిగ్ స్టార్స్‌ను చూపించి ఆడియెన్స్‌ను థ్రిల్ చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది..! ఈ మూవీలో ఒక పవర్‌ఫుల్ గెస్ట్ రోల్ కోసం మొదట నందమూరి బాలకృష్ణ పేరు బలంగా వినిపించింది. ట్రేడ్ వర్గాల్లో కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్ వచ్చింది. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని డేట్స్ ఇష్యూస్ వల్ల లేదా స్క్రిప్ట్ పరంగా ఉన్న మార్పుల వల్ల బాలయ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

ఇక బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కూడా ఈ రేసులోకి వచ్చారు. అయితే షారుఖ్ ప్రస్తుతం తన సొంత ప్రాజెక్ట్ కింగ్ పనుల్లో బిజీగా ఉండటంతో, జైలర్-2 కి నో చెప్పేశారట. ఇక విలక్షణ నటుడు విజయ్ సేతుపతి పాత్ర కూడా క్యాన్సిల్ అయినట్టు ఇండస్ట్రీ టాక్. ఒకవైపు రిలీజ్ డేట్ ఎనౌన్స్‌మెంట్ దగ్గరపడుతోంది.. షూటింగ్ పూర్తవుతోంది. కానీ గెస్ట్ రోల్స్ కోసం నెల్సన్ పడ్డ శ్రమ మాత్రం ఇప్పటికీ ఫలితాన్ని ఇవ్వడం లేదు. బిగ్ స్టార్స్ హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు నెల్సన్ Plan B ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. కొత్త స్టార్స్ కోసం వేట కొనసాగిస్తారా..? లేక ఉన్న రోల్స్‌తోనే మేనేజ్ చేస్తారా..? ఏది ఏమైనా జైలర్-2 లో రజనీకాంత్ మార్క్ యాక్షన్ మాత్రం పక్కా అని అర్థమవుతోంది. నెల్సన్ మేకింగ్ స్టైల్ మీద ఫ్యాన్స్‌కు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది.

Updated Date - Apr 09 , 2026 | 02:15 PM