Rajinikanth: పద్మ నిజాయితీకి సూపర్ స్టార్ ఫిదా..
ABN , Publish Date - Feb 03 , 2026 | 04:43 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పనికి ఫిదా అయ్యారు. ఆమెను స్వయంగా ఇంటికి పిలిచి మరీ సత్కరించారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth).. ఒక పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పనికి ఫిదా అయ్యారు. ఆమెను స్వయంగా ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. అంతేకాకుండా బంగారు గొలుసు కానుకగా ఇచ్చారు. అసలు ఏం జరిగింది అంటే.. పద్మ అనే మహిళ చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. ఇటీవల ఆమెకు పని చేస్తుండగా రోడ్డుపై 45 తులాల బంగారం దొరికింది. వేరేవారు అయితే దొరికింది మనదే అనుకోని ఇంటికి తీసుకెళ్తారు. కానీ, పద్మ అలా చేయలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి తనకు దొరికిన బంగారాన్ని పోలీసులకు అప్పజెప్పింది. ఆమె నిజాయితీకి పోలీసులు ఆశ్చర్యపోయారు. పద్మను అభినందించారు.
ఇక పద్మ చేసిన పనిని ప్రభుత్వం కూడా అభినందించింది. ఆమె నిజాయితీకి మెచ్చి రూ. లక్ష నగదు బహుమతిని కూడా ప్రకటించింది. అంతేకాకుండా భారత తపాలా శాఖ సైతం ఆమెకు అరుదైన గౌరవాన్ని అందించింది. పద్మ ఫోటోతో కూడిన ప్రత్యేక స్టాంపును విడుదల చేసి ఆమె నిజాయితీని మెచ్చుకుంది. ఈ విషయం తెల్సిన రజనీకాంత్.. పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. పద్మకు శాలువా కప్పి సత్కరించి, ఆమె నిజాయితీకి గౌరవంగా బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. పద్మ చేసిన పని ఎంతో గొప్పదని అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రజనీ చేసిన ఈ పనిని ఫ్యాన్స్ అభినందిస్తున్నారు.
రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం జైలర్ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇది కాకుండా మరో రెండు సినిమాలకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో కమల్ హాసన్ నిర్మాణంలో ఒకటి. కమల్ హాసన్ తో మల్టీస్టారర్ ఒకటి. ఈ రెండు కూడా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళనున్నాయి.