నిర్మాతకు.. రజనీ 5 సవర్ల ‘బంగారు’ బహుమతి
ABN , Publish Date - Apr 30 , 2026 | 10:42 PM
‘పడైయప్పా’ (Padayappa) (నరసింహ) చిత్ర నిర్మాత తేనప్పన్ (P. L. Thenappan) కు సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 5 సవర్ల బంగారు గొలుసును బహుమతిగా ప్రదానం చేశారు.
‘పడైయప్పా’ (Padayappa) (నరసింహ) చిత్ర నిర్మాత తేనప్పన్ (P. L. Thenappan) కు సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) 5 సవర్ల బంగారు గొలుసును బహుమతిగా ప్రదానం చేశారు. కేఎస్ రవికుమార్ (K. S. Ravikumar) దర్శకత్వంలో శివాజీ, రజనీకాంత్, సౌందర్య, రమ్యకృష్ణ తదితరులు నటించిన చిత్రం ‘పడైయప్పా’. 1999లో విడుదలైంది.
ఈ మూవీ విడుదలై పాతికేళ్లైన సందర్భంగా సినిమాను రజనీకాంత్ పుట్టిన రోజైన డిసెంబర్ 12న రీరిలీజ్ చేశారు. రీ రిలీజ్‌లోనూ ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఆ చిత్రం దర్శకుడు కేఎస్ రవికుమార్, హీరోయిన్ రమ్యకృష్ణ, నిర్మాత తేనప్పన్‌ను తన ఇంటికి ఆహ్వానించి అభినందించారు.
ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత తేనప్పన్‌ను మళ్లీ పోయెస్ గార్డెన్‌లోని తన నివాసానికి బుధవారం ఆహ్వానించిన రజనీకాంత్.. 5 సవర్ల బంగారు గొలుసును బహుమతిగా అందజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.