Rajinikanth: రిలీజ్‌కు ముందే 'ధర్మన్' సంచ‌ల‌నం.. ఓటీటీ హక్కులకు కళ్లు చెదిరే ధర?

ABN , Publish Date - Oct 29 , 2026 | 01:34 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ గా వచ్చిన జైలర్ 2 మూవీతో థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు.

Rajinikanth

కోలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులు అనే పదానికి అర్థం మార్చేసిన ఒకే ఒక్క పేరు.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth). లేటెస్ట్ గా వచ్చిన జైలర్ 2 మూవీతో థియేటర్లలో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారో ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉన్నారు. తమిళ ఇండస్ట్రీ హిస్టరీలోనే గతంలో తలైవర్ నెలకొల్పిన రికార్డులను మళ్ళీ తనే స్వయంగా తిరగరాస్తూ.. కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. 70 ప్లస్ ఏజ్ లోనూ బాక్సాఫీస్ దగ్గర ఆయన చూపిస్తున్న స్టామినా చూస్తుంటే యంగ్ హీరోలకు కూడా దిమ్మతిరిగిపోతోంది. అయితే 'జైలర్ 2' తెచ్చిన ఈ ఊపు తగ్గకముందే.. రజినీకాంత్ తర్వాతి ప్రాజెక్ట్ కి సంబంధించి ఇండస్ట్రీని షేక్ చేసే మరో బిగ్గెస్ట్ అప్డేట్ బయటకు వచ్చింది.

అదే.. క్రేజీ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ధర్మన్ (Dharman). ఓ మై కడవులే, డ్రాగన్‌ లాంటి డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌తో మెప్పించిన అశ్వత్ మారిముత్తు.. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్‌ను డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు. కథ విషయంలో రజినీకాంత్‌ను ఆయన ఎంతలా ఇంప్రెస్ చేశారో కానీ, ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే కోలీవుడ్ తో పాటు సౌత్ ఇండియా మొత్తం దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరికొత్త కాన్సెప్ట్‌తో, తలైవర్ మార్క్ స్వాగ్‌ను పీక్స్ లో ప్రజెంట్ చేసేలా అశ్వత్ ఈ స్క్రిప్ట్‌ను రెడీ చేశారని టాక్. ఇక అసలు విషయానికి వస్తే.. సినిమా షూటింగ్ దశలోనే ఉండగా, ఇప్పుడీ ప్రాజెక్ట్ పేరు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

కారణం.. దీని నాన్-థియేట్రికల్ బిజినెస్. ఈ చిత్రాన్ని లెజెండరీ యాక్టర్, ప్రొడ్యూసర్ కమల్ హాసన్ (Kamal Haasan) తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరో రెండు క్రేజీ ప్రాజెక్టులతో కలిపి ధర్మన్ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్ (Jio Hotstar) కు బండిల్ డీల్ కింద క్లోజ్ చేశారని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇందులో హైలైట్ ఏంటంటే.. ఈ ప్యాకేజీ మొత్తంలో కేవలం రజినీకాంత్ ధర్మన్ చిత్రానికే మైండ్ బ్లోయింగ్ ప్రైస్ దక్కిందట. కోలీవుడ్ వర్గాల ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఈ ఒక్క సినిమా ఓటీటీ రైట్స్ ఏకంగా ₹150 కోట్లకు అమ్ముడయ్యాయి.

కోలీవుడ్ చరిత్రలోనే రిలీజ్‌కు ముందే ఒక ప్రాజెక్ట్‌కి ఈ స్థాయిలో డిజిటల్ బిజినెస్ జరగడం నిజంగా ఒక సంచలనం. సినిమాపై ఉన్న అంచనాలకు ఈ డీల్ ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు.. ఈ సినిమాలో నటీనటులు, టెక్నీషియన్ల లైనప్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చే అంశం ఏంటంటే.. ఉస్తాద్ రామ్ పోతినేని (ram pothineni) ఈ సినిమాలో పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ధీటైన విలన్‌గా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. వీరిద్దరి మధ్య వచ్చే ఫేస్-ఆఫ్ సీన్స్ సినిమాకే మేజర్ హైలైట్‌గా నిలవనున్నాయి. ఇంకా న‌య‌నతార (Nayanthara), రాశీ ఖ‌న్నా (rashii khanna), శ్రీలీల (Sreeleela) వంటి స్టార్లు ఈ సినిమాలో కీ రోల్స్ చేస్తుండ‌డం విశేషం.

దానికితోడు రజినీకాంత్ సినిమా అంటే గుర్తొచ్చేది మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్. పేట, దర్బార్, జైలర్.. ఇలా ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన అనిరుధ్, ధర్మన్ కు కూడా సంగీతం అందిస్తున్నారు. తలైవర్ స్క్రీన్ ప్రెజెన్స్ కు అనిరుధ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం పక్కా. ఓవైపు బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న జైలర్ 2 మానియా.. మరోవైపు రిలీజ్ కాకముందే 150 కోట్ల బిజినెస్‌తో దుమ్మురేపుతున్న ధర్మన్ ప్రాజెక్ట్. మొత్తానికి రజినీకాంత్ లైనప్ చూస్తుంటే రాబోయే రోజుల్లో రికార్డుల వేట ఆగడం కష్టమే అనిపిస్తోంది.

Updated Date - Oct 29 , 2026 | 01:43 PM