శివకుమార్‌: ఎం.ఆర్‌.రాధాకు‘రత్తకన్నీర్‌’ - రాధికకు ‘తాయ్‌ కిళవి’

ABN , Publish Date - Mar 05 , 2026 | 09:33 AM

దివంగత నటుడు ఎంఆర్‌ రాధాకు ‘రత్తకన్నీర్‌’, (Raktha Kanneeru) ఇపుడు రాధికకు ‘తాయ్‌ కిళవి’ (Thai kilavi) చిత్రం ఓ మైలురాయని సీనియర్‌ నటుడు శివకుమార్‌ ప్రశంసించారు


దివంగత నటుడు ఎంఆర్‌ రాధాకు ‘రత్తకన్నీర్‌’, (Raktha Kanneeru) ఇపుడు రాధికకు ‘తాయ్‌ కిళవి’ (Thai kilavi) చిత్రం ఓ మైలురాయని సీనియర్‌ నటుడు శివకుమార్‌ ప్రశంసించారు. హీరో శివకార్తికేయన్‌ నిర్మాతగా, డెబ్యూ డైరెక్టర్‌ శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తాయ్‌ కిళవి’. ఇటీవల విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని చూసిన పలువురు హీరోలు, సినీ ప్రముఖులు రాధిక (Radhika Sarath kumar) నటనకు ఫిదా అయి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.

Thai-ki.jpg

ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తాజాగా సీనియర్‌ నటుడు శివకుమార్‌ చూసి, రాధికను అభినందనల్లో ముంచెత్తారు. దివంగత నటుడు ఎంఆర్‌ రాధా సినీ కెరీర్‌లో ‘రత్తకన్నీర్‌’, ఆయన కుమార్తె అయిన నటి రాధికకు ‘తాయ్‌ కిళవి’ చిత్రం మైలురాళ్ళంటూ ప్రశంసించారు. ఈ విషయాన్ని రాధిక తన ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశారు.‘శివకుమార్‌ అన్నా ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేస్తూ, ఆయనతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు. 

Updated Date - Mar 05 , 2026 | 09:43 AM