Radhika: దిగ్గజ దర్శకుడిని ఇలా చూస్తాననుకోలేదు!

ABN , Publish Date - Apr 20 , 2026 | 10:03 AM

కోలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు భారతీరాజాను (Bharathi Raja) నటి రాధిక శరత్‌కుమార్‌ )Radhika Sarathkumar) పరామర్శించారు.

కోలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు భారతీరాజాను (Bharathi Raja) నటి రాధిక శరత్‌కుమార్‌ )Radhika Sarathkumar) పరామర్శించారు. ఆయనను కలిసి వీడియోను ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌గా చేయగా వైరల్‌ అయింది. రాధిక నటించిన ‘తాయ్‌ కిళవి’ (thai kilavi) చిత్రంలోని నటనకు జాతీయ పురస్కారం దక్కుతుందని ఆయన ప్రశంసించారు. తన గురువు ఆశీర్వాదం అవార్డు కన్నా గొప్పదని రాధిక భావోద్వేగానికి లోనయ్యారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

‘నా దర్శకుడు, గురువు భారతీరాజాను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తానని, చూడాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. కానీ ఆయన్ని కలిసిన ఈ క్షణం ఎంతో గొప్పదిగా భావిస్తున్నా. తాజాగా నేను నటించిన ‘తాయ్‌ కిళవి’ చిత్ర దర్శకుడు శివకుమార్‌ మురుగేశన్‌ గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు. ఆయనకు ఇప్పటికీ సినిమా మీద ప్రేమ తగ్గలేదు’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కొంతకాలంగా దిగ్గజ దర్శకుడు భారతీరాజా అనారోగ్యంతో బాధపడుతున్నారు. కొన్ని నెలలపాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన ఇటీవల ఇంటికి చేరుకున్నారు.

Updated Date - Apr 20 , 2026 | 10:07 AM