రాధికా శరత్ కుమార్: వరలక్ష్మీని వాళ్ళ నాన్న చాలా టార్చర్ చేశాడు

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:21 PM

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (varalaxmi sarathkumar) నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి (Saraswathi). ప్రియమణి, రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 6 న రిలీజ్ కు సిద్ధమవుతోంది.

radhika

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (varalaxmi sarathkumar) నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం సరస్వతి (Saraswathi). ప్రియమణి, రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మార్చి 6 న రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్రబృందం తాజాగా హైదరాబాద్ లో సరస్వతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సీనియర్ నటీమణులు రాధిక, సిమ్రాన్, ప్రియమణి సందడి చేశారు.

సరస్వతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ.. వరలక్ష్మీని చూసి తాము ఎంతో గర్వపడుతున్నామని తెలిపారు. అంతేకాకుండా మొదట వరలక్ష్మీ, సినిమాల్లో నటిస్తాను అన్నప్పుడు వాళ్ళ నాన్న శరత్ కుమార్ వద్దు అన్నారని, కానీ వరూ చాలా పట్టుదలగా ఒప్పించి సినిమాల్లోకి వచ్చిందని రాధిక చెప్పారు. 'వరలక్ష్మీ నటి అవ్వాలి అన్నప్పుడు శరత్ కుమార్ అస్సలు ఒప్పుకోలేదు. ఆ అమ్మాయిని ఆయన చాలా టార్చర్ చేశారు పాపం. నువ్వేలా నటిస్తావ్.. ? నువ్వు యాక్ట్ చేయకూడదు అంటూ అరిచారు. నిర్మాతలకు కాల్ చేసి నా కూతురిని మీరు మీ సినిమాలో తీసుకోకూడదు అని చెప్పారు.

వరూ, వాళ్ళమ్మ ఛాయ నా దగ్గరకు వచ్చి.. నువ్వే శరత్ తో మాట్లాడాలి. వరూ నటించాలని అనుకుంటుంది అని చెప్పారు. డెసిషన్ మేకర్ ని నేను కాదు. మీరు శరత్ తో మాట్లాడండి. నేను కూడా సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. నమితతో సాంగ్ షూట్ లో ఉన్న శరత్ దగ్గరకు మేము వెళ్ళాం. మమ్మల్ని చూసి ఆయన పారిపోయారు. క్యార్ వ్యాన్ లో వరూ చాలా ఏడ్చింది. నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. మీరెందుకు వద్దంటున్నారు అని ఏడ్చింది. దానికి శరత్.. నా కూతురు ఇండస్ట్రీలోకి రాకూడదు అని నేను కోరుకున్నాను. చాలామంది ఇండస్ట్రీలో సఫర్ అవుతున్నారు. నిన్ను బాగా చదివించాను అని చెప్పారు. అయినా వరూ వినలేదు. ఏదో విధంగా శరత్ ని కన్విన్స్ చేసి హీరోయిన్ అయ్యింది.

వరూ మొదటి సినిమా చూసి శరత్ స్టన్ అయ్యారు. అప్పుడే చెప్పాను ఆమె చాలా మంచి నటి అవుతుంది అని, ఇప్పుడు మేము గర్వపడేలా చేస్తోంది. వరూకి నేను ఒక సలహా ఇచ్చాను. తెలుగు సినిమాలు చెయ్, తెలుగు ప్రేక్షకులు నిన్ను ఎంతో మంచిగా చూసుకుంటారు. సినిమాను సెలబ్రేట్ చేస్తారు అని చెప్పాను. అక్కడే ఎక్కువ ఫోకస్ చెయ్.. నీకు తగిన క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పాను' అని రాధిక తెలిపారు.

Updated Date - Mar 01 , 2026 | 03:44 PM