పూరి - సూర్య: అప్పుడు మిస్ అయింది.. ఇప్పుడు సెట్ అయినట్టే
ABN , Publish Date - Feb 28 , 2026 | 08:15 PM
పూరి జగన్నాథ్.. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు. సినిమా ప్రారంభం రోజే విడుదల తేది ప్రకటించే దర్శకుల్లో ఆయన మొదటి వరుసలో ఉంటారు.
పూరి జగన్నాథ్(Puri Jagannadh).. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు. సినిమా ప్రారంభం రోజే విడుదల తేది ప్రకటించే దర్శకుల్లో ఆయన మొదటి వరుసలో ఉంటారు. అయితే ప్రస్తుతం సరైన సక్సెస్ లేక వెనకపడ్డారు. కానీ ఆయన దృష్టి పెడితే సక్సెస్ పెద్ద కష్టం కాదు. ప్రస్తుతం కమ్ బ్యాక్ ఇవ్వాలని బలంగా ప్రయత్నిస్తున్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’, ‘లైగర్’ సినిమాలు ఆయన బ్రాండును డ్యామేజ్ చేశాయి. ఇప్పడు పూరికి హిట్ చాలా అవసరం. ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ సినిమా చేస్తున్నారు. సమ్మర్లో ఈ సినిమా విడుదల కానుంది.
ఆ తర్వాత చిత్రం కూడా దాదాపు కుదిరినట్టే. అయితే పూరి తమిళ హీరోతో సినిమా చేస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇప్పుడు తమిళ్ నుంచి సూర్య (SUriya) పేరు బయటకొచ్చింది. వీరిద్దరి కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే సూర్యతో పూరి సిట్టింగ్ వేశారని, కథల విషయంపై చర్చ నడిచిందని సమాచారం. సూర్య కూడా పూరితో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. మహేష్ బాబుతో చేసిన ‘బిజినెస్ మాన్’ కథ ముందుగా సూర్యనే విన్నారు. ఆయన కూడా ఓకే అన్నారు. కానీ పలు కారణాల వల్ల కార్యరూపం దాల్చలేదు. అయితే ఆ చిత్రంలో హీరో పేరు సూర్య.. సూర్య భాయ్. హీరో మారినా.. పేరు మాత్రం అలాగే ఉంచారు పూరి. మళ్లీ ఇన్నాళ్లకు సూర్యతో పని చేసే అవకాశం వచ్చింది. త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.