ఓట్ల తొలగింపుకే SIR.. ప్రకాశ్ రాజ్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Sep 27 , 2026 | 06:08 AM

జాబితా నుంచి అనేక మంది ఓట్లను తొలగించేందుకే కేంద్రం సర్ ప్రక్రియ ప్రారంభించిందని నటుడు ప్రకాశ్ రాజ్ ఆరోపించారు.

Prakash Raj

జాబితా నుంచి అనేక మంది ఓట్లను తొలగించేందుకే కేంద్రం సర్ ప్రక్రియ ప్రారంభించిందని నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ఆరోపించారు. సర్‌పై అవగాహన కల్పించేందుకు చేపట్టిన పర్యటనలో భాగంగా ప్రకాష్జ్ శనివారం క‌ర్ణాట‌క‌లోని కురుగోడు సమీపంలోని సిరిగేరి గ్రామాన్ని సందర్శించారు. ప్రకాష్ రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని మైసూరుకు చెందిన నిర్ది గంత సంస్థ, సిరిగేరికి చెందిన ధాత్రిరంగ సంస్థ సంయుక్తంగా యువత కోసం నిర్వహిస్తున్న 'రంగ శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు.

శ్రీ శంభులింగేశ్వర ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న శిబిరంలో నేలపై కూర్చుని స్థానికులతో పలు విషయాలపై చర్చించారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకుని, నటనకు సంబంధించిన పలు సూచనలు, సలహాలు అందించారు. యువత నటనతో పాటు రంగస్థల కళపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని ప్రకాష్ రాజ్ సూచించారు. నటనా రంగంలో రాణించేందుకు అవసరమైన అంశాల సాధన, క్రమశిక్షణ గురించి వివరించారు.

అల్లమప్రభు, బసవన్న, అక్కమహా దేవి వంటి శరణుల పుట్టిన ఉత్తర కర్ణాటకలో ఎంతో ప్రతిభావంతులైన యువత ఉన్నారని, వారి ప్రతిభను వెలికితీసేందుకు నిర్దిగంత సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. తన కుటుంబ నేపథ్యాన్ని కూడా యువతతో పంచుకున్న ప్రకాష్ రాజ్ కర్ణాటకలోని గదగ్, కొప్పాళ జిల్లాల్లో తన తాత అమ్మలు నివసించే వారని, తన తండ్రి మంగళూరుకు చెందిన వారని, తాను బెంగళూరులో పెరిగానన్నారు. నిరంతర సాధనతోనే మరిన్ని అవకాశాలకు మార్గం ఏర్పడుతందని సూచించారు.

ఉత్తర కర్ణాటక ప్రాంతం కన్నడ భాష సాహిత్యం, కళలకు సేవలందించిన అనేక మంది మహ నీయుల పుట్టినిల్లు అని పేర్కొన్నారు. సినీరంగంలో ప్రముఖ నటుడిగా ఉన్న ప్రకాష్రజ్ ఒక గ్రామానికి వచ్చి యువ కళాకారులతో కలిసి నేలపై కూర్చొని వారి అనుభవాలను తెలుసుకోవడం రంగస్థల కళపై మార్గదర్శనం చేయడం శిబిరార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని ప్రేరణను కలిగించింది.

రంగ దర్శకురాలు షకీలా అహ్మద్, దాత్రి రంగ సంస్థ కార్యదర్శి మంజునాథ్, అధ్యక్షులు ఎం పంపనగౌడ, పాత్రికేయులు శివరామ్, శిబిరార్డులు, సుమిత్ర మాన్వి, సుమంగళ హరప్పన హళ్లి, సరస్వతి, కావ్య, పూజా, ఫకీరస్వామి, విజయ్ కుమార్, సిరిగేరి, గణేష్ కుమార్, మహబూబ్, సిద్దేష్, వినయ్, నటన శిక్షణ బృందానికి చెందిన రంగ దర్శకులు గణేష్, మందార్తి, షకీల్ అహ్మద్, అరుణ్ లాల్, అమిత్ రెడ్డి, శశికుమార్, గురుదేవ్, ఆలయ కమిటీ సభ్యులు మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 07:32 AM