ఇకపై బయోపిక్స్‌లలో నటించను
ABN , Publish Date - Jul 06 , 2026 | 01:36 PM
ఇకపై తాను బయోపిక్ చిత్రాల్లో 'నటించనని ప్రముఖ హీరో ఆర్. మాధవన్ స్పష్టం చేశారు.
ఇకపై తాను బయోపిక్ చిత్రాల్లో 'నటించనని ప్రముఖ హీరో ఆర్. మాధవన్ (R. Madhavan) స్పష్టం చేశారు. జీడీ నాయుడు (G D Naidu) బయోపిక్ మూవీ స్టోరీని దర్శకుడు వివరించినపుడు తాను జీడీ నాయుడుగా నటించకుండా ఉండలేక పోయానని, అలాగే, జీడీ నాయుడు భారతీయ ఆవిష్కర్త, వ్యవసాయవేత్త, పరోపకారి, దాత ఒక గొప్ప వ్యక్తి అని, కానీ ఆయనకు స్వరాష్ట్రంలోనే తగిన గుర్తింపు దక్కలేదని మాధవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఈమూ వీ ట్రైలర్ విడుదల చేశారు.
ఈ ట్రైలర్ ప్రారంభంలో జీడీ నాయుడు తన వృద్ధాప్యంలో పిచ్చివాడిగా మారి తన సొంత భవనాన్ని బాంబుతో పేల్చివేశాడని ఒక వ్యక్తి చెప్పడం కనిపిస్తుంది. ఆ తర్వాత ఓ ఆంగ్లేయుడు 'ఎవరీ ఫకీర్ అంటూ: ప్రశ్నించడాన్ని చూపించి, ఆ పిమ్మట జీడీ నాయుడు పాత్ర ఆకట్టుకునేలా పరిచయం చేశారు. తన రవాణా వ్యవస్థ 'యూఎంఎస్' ద్వారా ఆయన రూ.కోట్లు సంపాదిస్తుండటంతో ప్రత్యర్థులు అసూయ పడి కుట్రలకు తెరలేపుతారు. అదే సమయంలో జీడీ నాయుడు ఒక పాలిటెక్నిక్ కాలేజీ కూడా స్థాపించినట్టు చూపించారు. ఇక జయరాం అధికార దర్పంతో కూడిన క్రూరమైన పాత్రలో కనిపించారు. 'వేటగాడి ప్రస్తావన లేకుండా కేవలం సింహం కోణంలోనే వేట కథ రాస్తే అది ధైర్యం అనే పదానికి అర్థమే మారి పోతుంది' అంటూ నటి అదితి బాలన్ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తుంది.
ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో హీరో ఆర్. మాధవన్ మాట్లాడుతూ, జీడీఎన్‌కు సొంత రాష్ట్రంలోనే తగిన గుర్తింపు దక్కలేదు. ఇటీవలే కోయంత్తూరులో కొత్తగా నిర్మించిన ఫ్లై ఓవర్‌కు జీడీ నాయుడు వంతెనగా నామకరణ చేశారు. ఈ సినిమా తర్వాత జీడీఎన్‌కు దేశ వ్యాప్తంగా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని ఆశిస్తున్నానన్నారు. వర్గీసీ మూలన్ పిక్చర్స్, ట్రైకలర్ ఫిలిమ్స్ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కృష్ణకు మార్ రామకుమార్, ఆర్. మాధవన్ అందించగా విజయ్ మూలన్, సరిత మాదవన్, ఆర్.మాధవన్ నిర్మించారు. కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహించాడు. సత్యరాజ్, జయరాం, దుషార విజయన్, ప్రియ మణి, కీలక పాత్రల్లో నటించారు..
ఇవి కూడా చదవండి:
ప్రభాస్ ‘ఫౌజీ’ రషెస్ చూసి మైండ్ బ్లాక్ అయింది: నాగవంశీ
ప్రకాష్ రాజ్.. ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నావ్?: బండ్ల గణేష్
ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’