Vijay: రాజకీయాల్లోకి రావడమే ఈ కష్టాలకు కారణం

ABN , Publish Date - Jan 31 , 2026 | 04:06 PM

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) చిత్రం పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

విజయ్‌ హీరోగా నటించిన ‘జన నాయగన్‌’ (Jana Nayagan) చిత్రం పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే.  దీనిపై ఇప్పటికే దర్శక నిర్మాతలు స్పందించారు. తాజాగా విజయ్‌ (Vijay) ఈ విషయంపై  ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడారు. ‘నేను రాజకీయాల్లోకి రావడం వల్లే నా సినిమాకు ఇలా చేస్తున్నారు. నా కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. రాజకీయరంగంలో రాకముందే వీటన్నిటికీ సిద్ధమయ్యాను. నా సినిమాపై ఈ ప్రభావం పడుతుందని ముందే ఊహించాను’ అని తెలిపారు. ఇదే విషయంపై నిర్మాత కె.నారాయణ స్పందించారు. విడుదల ఆలస్యం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు.  దశాబ్దాల పాటు అభిమానులను అలరించిన విజయ్‌కు సినిమాల నుంచి మంచి వీడ్కోలు దక్కాలని ఆయన ఆకాంక్షించినట్లు చెప్పారు.    సెన్సార్‌ సమస్య వల్ల ఈనెల జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా  వాయిదా పడింది. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సెన్సార్‌ బోర్డుకు అదే తేదీన మద్రాస్‌ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పును సవాలు చేస్తూ సీబీఎఫ్‌సీ మద్రాసు హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. సెన్సార్‌ సర్టిఫికెట్‌ జారీపై న్యాయస్థానం తాత్కాలిక స్టే విధించగా.. నిర్మాణ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సినిమా విడుదల విషయంలో జోక్యానికి నిరాకరించిన అత్యున్నత న్యాయస్థానం మద్రాసు డివిజన్‌ బెంచ్‌నే ఆశ్రయించాలని నిర్మాతలకు సూచించింది. ఈనెల 21న సుదీర్ఘ వాదనల అనంతరం డివిజన్‌ బెంచ్‌ తీర్పును రిజర్వ్‌ చేసింది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇవ్వాలని సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. మరోసారి దీనిపై విచారణ జరపాలని ఆదేశించింది.

Updated Date - Jan 31 , 2026 | 04:27 PM