పోలీస్ కంప్లైంట్ రిలీజ్ డేట్ ఖరారు
ABN , Publish Date - May 01 , 2026 | 03:52 PM
వరలక్ష్మీ శరత్ కుమార్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించిన సినిమా 'పోలీస్ కంప్లైంట్'. ఈ సినిమా మే 22న విడుదల కాబోతోంది.
సౌత్ ఇండియన్ టాలెంటెడ్ యాక్ట్రస్ వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై, బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంజీవ్ మేగోటి తెరకెక్కించారు. ఈ హారర్ థ్రిల్లర్, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ లాక్ చేశారు. ఈ విషయాన్ని వారు తెలియచేస్తూ, 'యాక్షన్, కామెడీ, రొమాన్స్ పుష్కలంగా ఉన్న థ్రిల్లర్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని మే 22న విడుదల చేయబోతున్నాం' అని అన్నారు.
రాగిణి ద్వివేది, కృష్ణ సాయి, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ ఇలా దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో 'పోలీస్ కంప్లైంట్' సినిమా రూపుదిద్దుకుంది. సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయని, ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్, రవితేజ ఫైట్స్ హైలైట్‌గా నిలుస్తాయని దర్శక నిర్మాతలు తెలిపారు.