Lakshmi Ammal: ప్ర‌ముఖ‌ గాయని.. లక్ష్మి అమ్మాల్‌ కన్నుమూత

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:37 PM

ప్రముఖ గ్రామీణ గాయని, ‘పరుత్తివీరన్‌’ ఫేమ్ లక్ష్మి అమ్మాల్ (75) అనారోగ్యంతో కన్నుమూశారు.

Lakshmi Ammal

ప్రముఖ గ్రామీణ కళాకారిణి, ‘పరుత్తివీరన్‌’ (Paruthiveeran) గాయని లక్ష్మి అమ్మాల్‌ (75) (Lakshmi Ammal) వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. విరుదునగర్‌ జిల్లా కారియపట్టికి చెందిన లక్ష్మి అమ్మాల్‌. తన కెరీర్‌ ఆరంభంలో పరవై మునియమ్మాళ్‌తో కలిసి దక్షిణాది జిల్లాల్లో జరిగే గ్రామీణ సంగీత కచేరీల్లో పాల్గొనేవారు. అయితే, పరవై మునియమ్మాళ్‌ ‘ధూల్‌’తో ఒక్కసారిగా ఫేమస్‌ అయ్యారు. దీంతో లక్ష్మి అమ్మాల్‌ సొంతంగా ఒక బృందాన్ని ప్రారంభించారు.

ఈ నేపథ్యంలో 2007లో అమీర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పరుత్తివీరన్‌’ సినిమా కోసం పాడిన పాటలతో మంచి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి ఆమె పేరు ‘పరుత్తివీరన్‌’ లక్ష్మి అమ్మాల్‌గా మారిపోయింది. అయితే 2016లో ఆమె రక్తనాళాల్లో ఏర్పడిన సమస్య కారణంగా పాటలు పాడలేకపోయారు.

Lakshmi Ammal

ఈ నేపథ్యంలో వయోభారంతో పాటు అనారోగ్య సమస్యల కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. 20 యేళ్ళ వయసు నుంచే ‘గుమ్మి పాట్టు’, ‘ఒప్పారి’, ‘తాలాట్టు’, ‘తెంబాంగు’, ‘భక్తి’ పాటలు పాడి చెరగని ముద్రవేసిన లక్ష్మి అమ్మాల్‌ మృతి వార్త తెలిసిన పలువురు సినీ ప్రముఖుల తమ ప్రగాఢ సాంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు.

Updated Date - Jan 01 , 2026 | 10:38 PM