Vettuvam: సంక్రాంతి బరిలోకి.. మరో క్రేజీ మూవీ

ABN , Publish Date - Nov 02 , 2026 | 01:28 PM

పా.రంజిత్ దర్శకత్వంలో ఆర్య, శోభిత ధూళిపాళ్ల నటించిన ‘వేట్టువం’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.

Vettuvam

పా.రంజిత్ (Pa. Ranjith) దర్శకత్వం వహించిన వేట్టువం (Vettuvam) చిత్రం వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ మేరకు దర్శకుడు తన ఎక్స్ వేది కగా ప్రకటించారు. 'వేట శక్తులు తమ క్రూరత్వాన్ని, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు.

సాయి దేవానంద్, సాయి వెంకటేశ్వరన్ లెర్న్ అండ్ టీచ్ బ్యానరుతో కలిసి పా.రంజిత్ నీలం ప్రొడక్షన్ పతాకంపై నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ 2022లో జరిగిన 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. అధికారం కోసం మూడు విభిన్న వర్గాల మధ్య రాజకీయ పోటీ, ఘర్షణలు ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తాలు కాగా, ఒక 'అపోకలిప్టిక్' యాక్షన్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో సిలంబం, మాల్కం వంటి సాంప్రదాయ తమిళ యుద్ధ కళలు, వాటి మెళకువలను కూడా చూపించారు.

ఆర్య, వీఆర్ దినేష్, శోభిత ధూళిపాళ్ళ (Sobhita Dhulipala) ప్రధాన పాత్రలను పోషించగా, కలైయరసన్, మైమ్ గోపి, గురు సోమసుందరం, షబీర్ కల్లరక్కన్, జాన్ విజయ్, సాయి దీనా, ఆనంద్ స్వామి, హరీష్ ఉత్తమన్ తదితరులు నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని తొలుత డిసెంబరులో విడుదల చేయాలని భావించినప్పటికీ అనివార్య కారణాలతో పొంగల్‌కు వాయిదా వేశారు. ఆ మ‌ధ్య విడుద‌ల చేసిన టీజ‌ర్ అటు త‌మిళంతో పాటు తెలుగు నాట‌ మ‌రింత బ‌జ్‌ను తీసుకువ‌చ్చింది. . అయితే.. ఇప్ప‌టికే సంక్రాంతికి తెలుగు నుంచే ఓ అర డ‌జ‌న్ ప్ర‌ధాన చిత్రాలు విడుద‌లకు రెడీగా ఉండ‌గా ఇప్పుడు వేట్టువం రాక‌తో పోటీ మ‌రింత‌గా పెరిగింది.

Updated Date - Nov 02 , 2026 | 01:44 PM