Jailer 2: నో.. డౌట్స్‌! చెప్పిన టైంకే జైల‌ర్‌2

ABN , Publish Date - Sep 03 , 2026 | 09:06 AM

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ చిత్రం ‘జైలర్‌-2’ అక్టోబరు 15వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ ప్రకటించింది.

jailer 2

సూపర్‌స్టార్‌ రజనీకాంత్ (rajini kanth) చిత్రం ‘జైలర్‌-2’ (jailer 2) అక్టోబరు 15వ తేదీన విడుదల చేయనున్నట్టు నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ బుధవారం ప్రకటించింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్ (nelson dileep kumar) దర్శకత్వం వహించిన ఈ చిత్రం మాఫియా, విగ్రహాల చోరీ, ప్రతీకార నేపథ్యం, ఫ్యామిలీ సెంటిమెంట్స్‌ తదితర అంశాల మేళవింపుగా రూపొందింది.

j2.jfif

గతంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ మూవీ ‘జైలర్‌’కు సీక్వెల్‌గా రానున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం విడుదల తేదీపై ఎన్నో రకాలుగా వార్తలు రాగా, చివరకు విడుదల తేదీని నిర్మాణ సంస్థ ఖరారు చేస్తూ ట్విట్టర్‌లో ప్రకటించింది.

Updated Date - Sep 03 , 2026 | 09:13 AM