నిరోషా: ‘తాయ్‌ కిళవి’ చూసి నిరోషా భావోద్వేగం

ABN , Publish Date - Feb 27 , 2026 | 04:21 PM

సీనియర్‌ నటి రాధిక ప్రధాన పాత్రలో నిర్మించిన ‘తాయ్‌ కిళవి’ సినిమా చూసి అలనాటి హీరోయిన్‌, రాధిక సోదరి నిరోషా కన్నీరు మున్నీరయ్యారు.

Thai Kilavi


సీనియర్‌ నటి రాధిక ప్రధాన పాత్రలో నిర్మించిన ‘తాయ్‌ కిళవి’ సినిమా చూసి అలనాటి హీరోయిన్‌, రాధిక సోదరి నిరోషా కన్నీరు మున్నీరయ్యారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుండగా సినీ సెలెబ్రిటీలు, మీడియాకు ప్రీమియర్‌ షో ప్రదర్శించారు. ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిరోషా తన అక్క రాధికను గట్టిగా హత్తుకుని బోరున విలపించారు. 

దీనిపై నిరోషా మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో మా అక్క పోషించిన పాత్ర చూసిన తర్వాత నాకు నోట మాట రాలేదు. అక్కను హత్తుకుని అభినందించాను. నాకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చాయి. దీనికి కారణం మా అమ్మ గుర్తుకు వచ్చారు. ఈ సినిమాలోని పలు సన్నివేశాల్లో అక్క పాత్రలో మా అమ్మను చూశాను. 'పలు సందర్భాల్లో మహిళలు ధైర్యంగా, ఆత్మగౌరవంతో ఉండాలని,ఎవరిపైనా ఆధారపడరాదు. మన కోసం కొంత సంపాదన చేర్చిపెట్టుకోవాలి. మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకోవాలి' అంటూ మా అమ్మ చెబుతుండేది. ఈ సినిమాలో అలాంటి సందేశమే ఉంది. అందుకే కాస్త ఎమోషనల్‌కు గురయ్యాను. చాలా రోజుల తర్వాత థియేటర్‌లో ఒక మంచి చిత్రం చూడటంతో పాటు కడుపుబ్బ నవ్వాను’ అని నిరోషా పేర్కొన్నారు. హీరో శివకార్తికేయన్‌ తన సొంత నిర్మాణ సంస్థ శివకార్తికేయన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు

Updated Date - Feb 27 , 2026 | 04:29 PM