Nimisha Sajayan: విమర్శలు.. అస్సలు పట్టించుకోను!

ABN , Publish Date - Jan 14 , 2026 | 10:45 AM

తనపై సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని యువ హీరోయిన్‌ నిమిషా సజయన్ (Nimisha Sajayan) అన్నారు.

Nimisha Sajayan

తనపై సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనని యువ హీరోయిన్‌ నిమిషా సజయన్ (Nimisha Sajayan) అన్నారు. ఈ మాలీవుడ్‌ హీరోయిన్‌ ‘జిగర్‌తండా డబుల్‌ ఎక్స్‌’, ‘మిషన్‌ చాప్టర్‌-1’తో సహా పలు తమిళ చిత్రాల్లో నటించి కోలీవుడ్‌కు దగ్గరైంది. ప్రస్తుతం తమిళం, మలయాళ భాషా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

Nimisha Sajayan

ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘విమర్శలు నాపైనా, నా కెరీర్‌పైనా ఏమాత్రం ప్రభావం చూపించవు. వాటి గురించి అస్సలు పట్టించుకోను. సద్విమర్శలు ఎలా ఉన్నప్పటికీ వాటిని స్వీకరిస్తాను. తప్పుంటే ఖచ్చితంగా నన్ను నేను మార్చుకుంటాను. అంతేకానీ, నా గురించి ఇష్టారీతిగా రాసే అసత్య కథనాలు, గాసి్‌ప్సను పరిగణనలోకి తీసుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను’ అని పేర్కొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 10:57 AM