Nayanthara: ఏడాదంతా.. న‌య‌న‌తార సినిమాలే! రిలీజుకు సిద్ధంగా 5 సినిమాలు

ABN , Publish Date - Jan 20 , 2026 | 09:39 PM

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, నెగెటివిటీ, ట్రోల్స్‌, విమర్శలు వంటివాటికి అతీతంగా స్టార్‌ హీరోయిన్‌ నయనతార రాణిస్తోంది.

Nayanthara

తనకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారం, నెగెటివిటీ, ట్రోల్స్‌, విమర్శలు వంటివాటికి అతీతంగా స్టార్‌ హీరోయిన్‌ నయనతార (Nayanthara) రాణిస్తోంది.. తాను నటించే చిత్రాల ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటానని నిర్మొహమాటంగా చెబుతున్నప్పటికీ దర్శక నిర్మాతలు మాత్రం ఆమెతో సినిమాలు తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఆమె ‘మూక్కుత్తి అమ్మన్‌-2’, ‘మన్నాంగట్టి’ పలు మూవీల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు త్వరలోనే విడుదలకానున్నాయి.

ఇవికాకుండా, మరికొన్ని తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో బిజీగా ఉన్నారు. అలాగే, పాన్‌ వరల్డ్‌ మూవీగా రూపొందే ‘టాక్సిక్‌’ చిత్రంలోనూ నయనతార నటిస్తుండ‌గా మార్చిలో విడుద‌ల అవుతోంది. నిజానికి నయనతార నటించి విజయం సాధించిన చివరి చిత్రం ‘బిగిల్‌’ 2019లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన ఒక్క తమిళ చిత్రం కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

అయినప్పటికీ కోలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. కాగా సంక్రాంతికి తెలుగులో విడుదలైన మన శంకరవర ప్రసాద్‌ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కావడంతో నయనతార టాలీవుడ్‌లో ఈ ఏడాది ప్రారంభంలోనే పెద్ద హిట్‌ అందుకున్నారు. కాగా ఈ ఏడాది న‌య‌న తార న‌టించిన‌ అర డ‌జ‌న్ చిత్రాలు విడుద‌ల కానున్నాయి.

Updated Date - Jan 20 , 2026 | 09:53 PM