ఈ సినిమా నా జీవితంలో ప్రత్యేకం.. ‘మహాశక్తి’ ఎమోషనల్ నోట్! నయనతార లేఖ వైరల్

ABN , Publish Date - Oct 30 , 2026 | 06:32 AM

‘మూక్కుత్తి అమ్మన్ 2’ తనకు ఎంతో ప్రత్యేకమైన సినిమా అంటూ నయనతార ఎమోషనల్ లేఖ విడుదల చేశారు.

Nayanthara

'చిత్రీకరణ పూర్తయిన తర్వాత కూడా కొన్ని చిత్రాలు పదికాలాల పాటు హృదయాల్లో నిలిచిపోతాయని, మూక్కుత్తి అమ్మన్-2 (Mookuthi Amman 2) అలాంటి సినిమా అని ప్రముఖ నటి నయనతార అన్నారు. సుందర్. సీ (Sundar C) దర్శకత్వంలో నయనతార (Nayanthara) ప్రధాన పాత్ర పోషించిన మూక్కుత్తి అమ్మ న్-2 ( తెలుగులో మ‌హా శ‌క్తి (Mahasakthi)) చిత్రం దీపావళి కానుకగా నవంబరు 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవ‌ల చెన్నైలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ చిత్ర బృందం నిర్వహించింది. ఈ సందర్భంగా నయనతార ఒక లేఖ విడుదల చేశారు.

'మీ విజన్, ప్రేమ, అభిరుచిని ఈ చిత్రంలోకి తీసుకొచ్చినందుకు దర్శకుడు సుందర్‌కు ధన్యవాదాలు. మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రతిక్షణం మీరు చూపిన శ్రద్ధ, ఈ ప్రయాణాన్ని మరపురానిదిగా చేసినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను నమ్మి. మాకు మద్దతు ఇచ్చిన నిర్మాత ఐసరి కె.గణేష్‌కు ధన్యవాదాలు. కథకు మనస్ఫూర్తిగా మద్దతు ఇచ్చే నిర్మాత ఉండటం వల్ల ఈ ప్రయాణం చాలా సజావుగా సాగింది. ఈ ప్రయాణాన్ని మీతో పంచుకోడం చాలా ఆనం దంగా ఉంది.

మీకు ఎదురయ్యే ప్రతి విషయంలోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఖుష్బూ, స్నేహ.. మీ ఇద్దరితో కలిసి ఈ చిత్రంలో నేను భాగమైన ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ పదిలపరచుకుంటాను. మీ ఇద్దరికీ నా ప్రేమ, అప్యాయతలు ఎప్పటికీ ఉంటాయి. ఇంత అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో కలిసి ప్రయాణించడం ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మనమంతా కలిసి సృష్టించిన ఈ ప్రపంచాన్ని మీరందరూ చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓం శక్తి' అంటూ నయనతార పేర్కొన్నారు.

Updated Date - Oct 30 , 2026 | 06:32 AM