Nayanthara: అనీల్ రావిపూడి ఎఫెక్ట్‌.. కొత్త వివాదంలో న‌య‌న‌తార‌

ABN , Publish Date - Jan 05 , 2026 | 09:30 AM

వ‌రుస సినిమాల‌తో రెండు ద‌శాబ్దాలుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా తిరుగులేని సూప‌ర్‌ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న క‌థానాయిక న‌య‌న‌తార.

Nayanthara

వ‌రుస సినిమాల‌తో రెండు ద‌శాబ్దాలుగా సౌత్ ఇండియా వ్యాప్తంగా తిరుగులేని సూప‌ర్‌ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న క‌థానాయిక న‌య‌న‌తార (Nayanthara). పెళ్లి త‌ర్వాత కూడా అదే స్థాయిలో చేతి నిండా చిత్రాలు చూస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయితే మొద‌టి నుంచి ఎన్ని సినిమాలు చేసినా ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌కు మాత్రంచాలా దూరంగా ఉంటూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ప‌దుల సంఖ్య‌లో సినిమాలు సైతం వదిలేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ నయనతార మరో మారు వివాదంలో చిక్కుకున్నారు.

అయితే తాజాగా తెలుగులో చేసిన సినిమా న‌య‌న్‌కు కొత్త త‌ల‌నొప్పి తీసుకు వ‌చ్చింది. తమిళంతో పాటు ఇప్ప‌టి వ‌ర‌కు తాను నటించే చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండే నయన తార.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) తో కలిసి నటించిన మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu) సినిమా ప్రమోషన్ కోసం ఓ వీడియో చేయడమే ఈ వివాదానికి కారణమైంది. దీంతో తమిళ సినిమా అంటే తక్కాలి తొక్కా (Thakkali Chutney) అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు.

Nayanthara

తమిళంలో ఎంత పెద్ద హీరోతో కలిసి నటించినా లేదా ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీలో నటించినా ఆ చిత్రాల ప్రమోషన్‌కు నయనతార ఆమడ దూరంలో ఉంటున్నారు. దీన్ని ఒక రూల్‌గా పాటిస్తున్నారు. వాస్తవానికి నేటి కాలంలో సినిమాకు ప్రమోషన్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ, నయన తార మాత్రం తమిళ చిత్ర ప్రమోషన్‌కు దూరంగా ఉంటూ ఆయా నిర్మాతలను ఎంతో మానసిక క్షోభకు గురిచేస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పుడు నయనతార తెలుగు చిత్రం ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొని తమిళ నిర్మాతల మరింత ఆగ్రహానికి గురయ్యారు..

Updated Date - Jan 05 , 2026 | 10:06 AM