విజ‌య్ అంటోని.. మ‌ళ్లీ ఏడిపించేలా ఉన్నాడుగా! నాన్న‌కుట్టి నుంచి.. ఫాద‌ర్ సెంటిమెంట్‌ సాంగ్‌

ABN , Publish Date - Oct 23 , 2026 | 10:10 PM

భ‌ద్ర‌కాళి, మార్గాన్‌, వంద దేవుళ్లు వంటి విభిన్న చిత్రాల త‌ర్వాత త‌మిళ న‌టుడు విజ‌య్ అంటోని నుంచి వ‌స్తోన్న‌ నూత‌న చిత్రం నాన్న కుట్టి.

Vijay Antony

భ‌ద్ర‌కాళి, మార్గాన్‌, వంద దేవుళ్లు (Vanda Devullu) వంటి విభిన్న చిత్రాల త‌ర్వాత త‌మిళ న‌టుడు విజ‌య్ అంటోని (Vijay Antony) నుంచి వ‌స్తోన్న‌ నూత‌న చిత్రం నాన్న కుట్టి (Nanna Kutti). ఇప్ప‌టి వ‌ర‌కు బిచ్చ‌గాడు అంటు తల్లి సెంటిమెంట్‌, వంద దేవుళ్లు అంటూ వితంతువుకు మ‌ళ్లీ పెళ్లి వంటి తీరోక్క క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న విజ‌య్ అంటోని ఇప్పుడు ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో న‌వంబ‌ర్ 20న థియేట‌ర్ల‌కు వ‌చ్చేందుకు ముస్తాబ‌య్యాడు. మార‌న్ (MU.Maran) ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.తెలుగులో ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇప్ప‌టికే విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం భారీ సినిమాల పోటీ నేప‌థ్యంలో వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఎట్టకేల‌కు న‌వంబ‌ర్ నెలాఖ‌రున విడుద‌ల చేస్తున్నారు. ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, హృద్యమైన కథనం, సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ ‘నాన్న కుట్టి’ చిత్రం నుంచి తాజాగా నాన్న‌లా లోకంలో (Nannala Lokamulo) అంటూసాగే ఎమోష‌న‌ల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. భాష్య‌శ్రీ (Bhashyasree) సాహిత్యం అందించిన ఈ పాట‌ను విజ‌య్ అంటోని సంగీతంలో మౌస‌మి నేహా (Moushmi Neha) ఆల‌పించింది. పాట ఆద్యంతం తండ్రి విలువ‌ను తెలియ‌జేస్తూ బిడ్డ కోసం త‌ను చేసే త్యాగాల‌ను, పిల్ల‌ల‌పై అత‌ని ప్రేమ‌ను గుర్తు చేస్తూ వీక్ష‌కుల‌ను, శ్రోత‌ల‌ను కంట‌త‌డి పెట్టించేలా ఉంది. మీరూ ఈ పాట‌పై ఓ లుక్ వేయండి.

Updated Date - Oct 23 , 2026 | 10:13 PM