నా కుమారుడు.. ధనుష్ రాజకీయాల్లోకి వ‌స్తాడు

ABN , Publish Date - Jun 02 , 2026 | 06:31 AM

సినీ నటుడు ధనుష్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఆయన తండ్రి, దర్శకనటుడు కస్తూరి రాజా తెలిపారు.

Dhanush, Kasthuri Raja

సినీ నటుడు ధనుష్ (Dhanush ) రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందని ఆయన తండ్రి, దర్శకనటుడు కస్తూరి రాజా (Kasthuri Raja) తెలిపారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కస్తూరి రాజా మాట్లాడుతూ.. ‘గోపాలపురం నుంచే రాజకీయం ప్రారంభమైంది. చాలా నిర్ణయాలు అక్కడి నుంచే తీసుకున్నారు.

ధనుష్‌, మీరు కూడా అక్కడే ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందా?’ అని చాలామంది అడుగుతున్నారు. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు. వారి ఇష్టం. భవిష్యత్తులో ధనుష్‌ కూడా రావచ్చు. చెన్నైలో పవర్‌ఫుల్‌ ప్రాంతం గోపాలపురమే. కరుణానిధి జీవించిన ప్రాంతం అది. ఇప్పుడు సీఎం పోయ‌స్ గార్డెన్‌కు వస్తున్నట్టు చెబుతున్నారు.

వస్తే రానివ్వండి. నా కుటుంబం నుంచి ఎవరైనా రాజకీయాలకు రావచ్చు. నా కుమారుడు ధనుష్‌ కూడా రావచ్చు’’ అని వ్యాఖ్యానించారు. కాగా, ముఖ్యమంత్రి విజయ్‌ తరహాలోనే ధనుష్‌ చాలా కాలంగా తన అభిమాన సంఘాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన జన్మదినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు రకాల సహాయాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కస్తూరి రాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Updated Date - Jun 02 , 2026 | 06:33 AM