Dhanush: జీవీ ప్రకాశ్, అనిరుధ్ ఔట్.. అభయంకర్ ఇన్! ధనుష్ సినిమాకు.. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:06 AM
ధనుష్ తన 55వ చిత్రం అమరన్ ఫేం డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ సామితో చేస్తున్న సంగతి తెలిసిందే.
తేరే ఇష్క్ మే వంటి బ్లాక్‌బస్టర్ చిత్రం తర్వాత తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) నటించిన 54వ చిత్రం కర (Kara). ఫోర్ తొళిల్ (Por Thozhil) ఫేమ్ విగ్నేశ్ రాజా (Vignesh Raja) దర్శకత్వం వహించగా వేల్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీ ఈ ఫిబ్రవరిలో థియేటర్లకు రానుంది. అయితే ఈ చిత్రం అనంతరం ధనుష్ నటించబోయే సినిమా విషయంలో ఓ ఆసక్తికర అప్డేట్ అధికారికంగా బయటకు వచ్చింది.
ధనుష్ తన 55వ చిత్రం అమరన్ ఫేం డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియ సామి (Rajkumar Periasamy) తో చేస్తున్న సంగతి తెలిసిందే. వండర్ బార్ ఫిలింస్ (Wunderbar Films) నిర్మిస్తోన్న ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతోంది. సాయి పల్లవి కథానాయుకగా నటిస్తోండగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర చేస్తున్నాడు.
అయితే ఈ సినిమాకు అనిరుధ్ కాకుండా డ్యూడ్ ఫేం సాయి అభయంకర్ (Sai Abhyankkar) సంగీతం అందించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి దర్శకుడు, హీరో కలిసి సాయి అభయంకర్‌కు పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అయితే.. తన కేరీర్‌లో ఇప్పటి వరకు చేసిన చిత్రాల్లో అధిక భాగం జీవీ ప్రకాశ్ కుమార్ (G. V. Prakash Kumar) తోనే చేసి మంచి విజయాలు సాధించడంతో పాటు హిట్ పెయిర్‌గా గుర్తింపును దక్కించుకున్నారు ధనుష్. ఓ సందర్భంలో ధనుష్ అంటే జీవీ.. జీవీ అంటే ధనుష్ ఇద్దరిని వేర్వేరుగా చూడలేం అనేంతగా వీరి పేరు ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఆ తర్వాత అనిరుధ్ (Anirudh Ravichander) తోనూ అదే తరహా పేరును కొనసాగించిన ధనుష్ ఇప్పుడు రూట్ మార్చడం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ కొత్త కాంబినేషన్ వారిలానే మ్యూజిక్‌తో మ్యాజిక్ కంటిన్యూ చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.