Mrunal Thakur: ధనుష్ విరోధితో మృణాల్ రొమాన్స్..

ABN , Publish Date - Jan 28 , 2026 | 08:37 PM

బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మృణాల్.. కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయింది.

Mrunal Thakur

Mrunal Thakur: బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోన్న విషయం తెల్సిందే. ఇప్పుడు మృణాల్.. కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయింది. అందుతున్న సమాచారం ప్రకారం కోలీవుడ్ స్టార్ హీరో శింబు (Simbu) సరసన మృణాల్ నటిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. శింబు ప్రస్తుతం అరసన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటుంది. ఇది కాకుండా శింబు.. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది.

ఇక అందుతున్న సమాచారం ప్రకారం శింబు - అశ్వత్ మారిముత్తు సినిమాలో మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాతోనే మృణాల్ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తతో ధనుష్ - మృణాల్ పెళ్లి పుకార్లకు ఫుల్ స్టాప్ పడినట్లు కోలీవుడ్ మీడియా చెప్తుంది. అదెలా అంటే.. కొన్నేళ్లుగా ధనుష్ - శింబు మధ్య మాటలు లేవని, పైకి నవ్వుతూ కనిపించినా వారిద్దరి మధ్య విరోధం ఉందని తమిళ్ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.

ధనుష్ తో మృణాల్ పెళ్లి అనేది నిజమైతే ఆమె తనకు కాబోయే భర్తకు విరోధిగా ఉన్న శింబుతో రొమాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకుంటుంది.. ఒకవేళ ఆమె ఒప్పుకున్నా దానికి ధనుష్ ఎలా అంగీకరిస్తాడు. శింబుతో మృణాల్ నటిస్తోంది అంటే.. ధనుష్ తో పెళ్లి నిజం కాదన్నమాటే కదా అని తమిళ్ తంబీలు అంటున్నారు. ధనుష్ తో పెళ్లి పుకార్లను మృణాల్ ఇన్ డైరెక్ట్ గా ఇలా ఖండించిందని కూడా చెప్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజమున్నది అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Jan 28 , 2026 | 08:39 PM