'జననాయకన్' టీ-షర్టులకు.. భారీగా ఆర్డర్లు
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:41 AM
ముఖ్యమంత్రి విజయ్ చివరి చిత్రంగా నటించిన జన నాయగన్ ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి థియేటర్లలో విడుదల కానుంది.
ముఖ్యమంత్రి విజయ్ (Thalapathy Vijay) చివరి చిత్రంగా నటించిన జన నాయగన్ (Jana Nayagan) ఈ నెల 23న ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ సైతం స్టార్ట్ అవగా రికార్డ్ స్థాయిలో సేల్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా విడుదల సందర్భంగా తిరుప్పూర్ 'జన నాయ కన్' టీ-షర్ట్ లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి.
సినిమా రిలీజ్ సందర్భంగా తొలి రోజు విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు ప్రత్యేక టీ-షర్ట్ ధరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో, తిరుప్పూర్, పరిసర ప్రాంతాల్లోని కంపెనీల్లో జననాయకన్ టీ-షర్ట్ తయారవుతున్నాయి. రాష్ట్రం నుంచే కాకుండా కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల నుంచి ఆర్డర్లు వస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.