మోహన్‌లాల్.. దృశ్యం 3 విడుదల వాయిదా

ABN , Publish Date - Mar 25 , 2026 | 07:07 AM

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ విడుదల కొత్త‌ తేదీకి మారింది.

drishyam3

సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మలయాళ థ్రిల్లర్‌ ‘దృశ్యం 3’ (Drishyam 3) విడుదల కొత్త‌ తేదీకి మారింది. ముందు ప్రకటించిన విధంగా ఏప్రిల్‌ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం మే 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘గతం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది. జార్జ్‌ కుట్టి మే 21న వస్తున్నాడు’ అని పేర్కొంటు ఓ పోస్టర్‌ విడుదల చేశారు. ఈ సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న మోహన్‌లాల్ (Mohanlal) పుట్టిన రోజు కూడా మే 21నే కావడం విశేషం. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ (Jeethu Joseph) దర్శకత్వం వహించారు.

Drishyam 3

యుద్ధ పరిస్థితులే కారణమా?

మలయాళ సినిమాలకు గల్ఫ్‌ దేశాల్లో ఉండే క్రేజే వేరు. సొంత రాష్ట్రంలో తెచ్చుకున్న కలెక్షన్ల కంటే గల్ఫ్‌ దేశాల్లో సాధించిన వసూళ్లు ఎక్కువ ఉంటాయని ఇప్పటికే చాలా సినిమాల విషయంలో రుజువైంది. పశ్చిమాసియాలోని యుద్ధ పరిస్థితుల కారణంగా మలయాళ సినిమాలకు ఆయువుపట్టు లాంటి ఈ మార్కెట్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలోనే ‘దృశ్యం 3’ మేకర్స్‌ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Mar 25 , 2026 | 08:52 AM