రజనీకి మిథున్ చక్రవర్తి పెట్టిన కండీషన్స్ ఏంటో తెలుసా..
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:46 PM
రజనీకాంత్ కథానాయకుడిగా ఈ నెల 15న రానున్న ‘జైలర్ 2’ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా వచ్చిన హిట్ చిత్రం ‘జైలర్’కు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2). నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. షూటింగ్ టైమ్‌లో ఆయన తలైవాకు ఓ ఆసక్తికరమైన కండీషన్ పెట్టారట. తన పాత్రను హీరో కొట్టకూడదని.. అలా అయితేనే అంగీకరిస్తానని అన్నారట. తాజాగా ‘జైలర్ 2 సూపర్ షో’ కార్యక్రమంలో రజనీకాంత్ ఈ విషయాన్ని తెలిపారు. ‘‘ఈ సినిమాలో ఓ కీలక పాత్రకోసం దర్శకనిర్మాతలు మిథున్‌ను సంప్రదించినప్పుడు.. ఆ పాత్ర గురించి ఆయన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒకవేళ విలన్ అయితే.. దెబ్బలు తినాలా?. నన్ను కొట్టే సన్నివేశాలు ఉంటే చేయను’ అని నవ్వుతూ అన్నారట’ అని రజనీ చెప్పారు.
అయితే ఇదే విషయంపై వేవ్స్ సమ్మిట్‌లో ఈ సినిమా చర్చ వచ్చింది. ‘రజనీకాంత్ అడిగితే నటించేందుకు సిద్థమేనని మిథున్ చెప్పారు. కానీ తనను కొట్టకూడదని, కాల్చడం లాంటివి చేయకూడదని కండీషన్ పెట్టారట. ఈ కండీషన్ గురించి దర్శకుడు నెల్సన్‌తో ఇంటరాక్ట్ అయ్యి చెబుతానని సమాధానమిచ్చినట్లు మిథున్ తెలిపారు. ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తితోపాటు మోహన్‌లాల్, రమ్యకృష్ణ, విద్యాబాలన్, ఎస్.జె. సూర్య కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఇప్పటి వరకూ లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయ్యాయి.
ఇవి కూడా చదవండి:
OTT This Week: ఈ వారం కొత్తగా ఓటీటీకి వచ్చిన, రాబోతున్న సినిమాల జాబితా
సీఎం విజయ్ ని కలిసిన రౌడీ విజయ్..
బన్నీ-లోకేష్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజం ఇదే