Patriot Movie: ఏప్రిల్ 23న థియేట‌ర్ల‌కు.. మమ్ముట్టి, మోహన్‌లాల్ 'పేట్రియాట్'

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:27 PM

పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సూపర్‌స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్ కలిసి పేట్రియాట్ అనే చిత్రం చేసిన‌ సంగ‌తి తెలిసిందే.

Patriot Movie

దాదాపు పద్దెనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మలయాళ సూపర్‌స్టార్స్‌ మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల్ (Mohanlal) కలిసి పేట్రియాట్ (Patriot) అనే చిత్రం చేసిన‌ సంగ‌తి తెలిసిందే. మహేశ్‌ నారాయణ్ (Mahesh Narayanan) దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుద‌ల‌కు ముస్తాబ‌యింది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే రిలీజ్ చేసిన టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాలు తీసుకు రాగా ఈ భారీ కాస్టింగ్ సినిమాను ఎప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురు చూసేలా చేశారు.

అయితే .. మేక‌ర్స్ తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీపై అప్డేట్ ఇచ్చారు. ఫహద్‌ ఫాజిల్ (Fahadh Faasil), కుంచకో బోబన్ (Kunchacko Boban), నయనతార (Nayanthara), రేవ‌తి (Revathy) వంటి స్టార్స్ సైతం కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 23న పాన్ ఇండియాగా రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.

Patriot Movie

ఈ మూవీలో.. మోహ‌న్ లాల్ మిల‌ట‌రీ అధికారిగా, మ‌మ్ముట్టి నేర‌స్థుడిగా, ఓ మిష‌న్ కోసం ప‌ని చేసే వాడిగా క‌నిపించ‌గా పాహాద్ ఫాజిల్ కంపెనీ హై అఫీసియ‌ల్‌గా కాస్త ప్ర‌తినాయ‌క ఛాయ‌లు ఉన్న పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. యాక్ష‌న్ సీన్లు భారీగానే ఉండ‌నున్నాయి.

Updated Date - Jan 26 , 2026 | 12:45 PM