మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా?
ABN , Publish Date - Aug 20 , 2026 | 02:58 PM
మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.
మమితా బైజు(Mamitha Baiju).. ప్రస్తుతం దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. తక్కువ సమయంలో హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది. తాజాగా విడుదలైన ‘విశ్వనాథ్ & సన్స్’లో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది మమిత. నివిన్ పౌలి హీరోగా, మమిత కథానాయికగా తెరకెక్కుతున్న చిత్రం ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’(Bethlehem Kudumba Unit). ‘ప్రేమలు’ ఫేమ్ గిరీష్ ఏ.డి. దర్శకత్వం వహించారు. ఈ నెల 21 ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఏ నేపథ్యంలో విడుదల చేసిన చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అలాగే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా వేగవంతంగా సాగుతున్నాయి.
‘విశ్వనాథ్ & సన్స్’ సినిమాతో నటనలో తన మార్క్ చూపించిన మమితా బైజు ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా? మమితా బైజు మ్యాజిక్ మళ్లీ పనిచేస్తుందా? ఆమెకున్న క్రేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ ‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే చర్చ ఇప్పుడు సినీ వర్గాల్లో నడుస్తోంది. ఇటీవల వరుస విజయాలతో మంచి క్రేజ్ సంపాదించిన మమితా బైజు.. ఈ సినిమాతో కూడా అదే జోరు కొనసాగిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు నివిన్ పౌలీ కూడా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.