మమిత ఎఫెక్ట్.. శ్రీలీల, భాగ్యశ్రీ ఔట్! నెల రోజుల్లో.. రూ.750 కోట్లు
ABN , Publish Date - Sep 01 , 2026 | 02:14 PM
మలయాళ కుట్టీ మమిత బైజు ఏ ముహుర్తాన హీరోయిన్‌గా సినిమాలు మొదలు పెట్టిందో గానీ అమె పట్టిందల్లా బంగారం అవుతోంది.
మలయాళ కుట్టీ మమిత బైజు (Mamitha Baiju) ఏ ముహుర్తాన హీరోయిన్‌గా సినిమాలు మొదలు పెట్టిందో గానీ అమె పట్టిందల్లా బంగారం అవుతోంది. మూడేండ్ల క్రితం అనామకంగా వచ్చిన ప్రేమలు చిత్రం దక్షిణాది వ్యాప్తంగా సంచలన విజయం సాధించి వంద కోట్లకు పైగా రాబట్టి అందరినీ షాక్ గురిచేసింది. అది మరువక ముందే గతేడాది ప్రదీప్ రంగనాధన్ హీరోగా వచ్చిన డ్యూడ్, ఈ వేసవిలో వచ్చిన ధనుష్ కర (Kara) సినిమాలు సైతం మిక్స్‌డ్ టాక్‌తోనే అటు ఇటుగా రూ.100 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టి విజయబావుటా ఏగురవేయడం విశేషం. అయితే.. మమిత కన్నా ముందు నుంచే టాప్ హీరోయిన్స్‌గా సౌత్‌లో చెలామణిలో ఉన్న శ్రీలీల (Sreeleela), భాగ్యశ్రీ (Bhagyashri Borse)లకు సైతం ఇప్పటివరకు సాధ్యం కానీ రికార్డులను స్వల్ప కాలంలోనే అధిగమించి గోల్డెన్ లెగ్‌గా పేరు సంపాదించుకుంది.
ఈ క్రమంలోనే ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన మమిత అంతకుమించి అనే రేంజ్‌లో విజయాలను తన ఖాతాలో వేసుకుని ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు ఈ భామ ఇటీవల ఏ కథానాయికకు సాధ్యంకానీ ఓ అరుదైన బాక్సాఫీస్ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కేవలం 29 రోజుల వ్యవధిలో వరుసగా మూడు ₹200 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన చిత్రాల్లో నటించిన తొలి భారతీయ హీరోయిన్‌గా మమితా బైజు నిలిచింది. దీంతో ఇటీవల సోషల్ మీడియాలో ఆమె అభిమానులు "మాతా పితా మమితా" అనే యాష్ ట్యాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చి మమిత లక్కీ ఛార్మ్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు.

జన నాయగన్‌తో భారీ ఆరంభం
దళపతి విజయ్ హీరోగా హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన రాజకీయ యాక్షన్ డ్రామా ‘జన నాయగన్’ (Jana Nayagan) జూలై 23న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ₹300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింన ఈ భారీ ప్రాజెక్ట్‌లో మమితా బైజు కీలక పాత్ర పోషించింది. ఆపై మమితా బైజు నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath & Sons) ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూర్య హీరోగా, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల హృదయాలను టచ్ చేసింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ సాధించి మరో భారీ విజయాన్ని అందుకుంది.
ఇక లేటెస్ట్‌గా.. ఓనమ్ సందర్భంగా ఆగస్టు 21న విడుదలైన ‘బెత్లెహేమ్ కుటుంబ యూనిట్’ (Bethlehem Kudumba Unit) కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నివిన్ పాలీ, మమితా బైజు జంటగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను గిరీష్ ఏ.డి తెరకెక్కించారు. కేవలం 11 రోజుల్లోనే ₹200 కోట్ల క్లబ్‌లోకి చేరిన ఈ చిత్రం మాలీవుడ్ చరిత్రలో అత్యంత వేగంగా ఆ మైలురాయిని అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇలా.. జూలై 23 నుంచి ఆగస్టు 21 మధ్య విడుదలైన ఈ మూడు చిత్రాలు వరుసగా ₹200 కోట్లకు పైగా గ్రాస్ సాధించడంతో మమితా బైజు పేరు ఇప్పుడు సర్వత్రా మారు మ్రోగుతోంది.
ఈ వరుస భారీ విజయాలతో మేకర్స్, హీరోలకు హాట్ ఫేవరేట్‌గా మారిన మమిత ప్రస్తుతం దర్శక నిర్మాతల తొలి ఎంపికగా మారిపోయింది. అంతేగాక సౌత్ ఇండియన్ సినిమాలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయికల జాబితాలో చేరిపోయింది. ఇదే సమయంలో దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలనే చందాన మమిత తన రెమ్యునరేషన్ సైతం రెట్టింపు చేసినట్లు వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. రాబోయే సినిమాలతో మమిత ఇలాంటి మ్యాజిక్‌నే రిపీట్ చేస్తుందేమో చూడాలి.