Tovino Thomas: ‘గుప్పి’కి పదేళ్లు.. అదే కాంబోతో టొవినో థామస్ కొత్త సినిమా
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:50 AM
మాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టొవినో థామస్, దర్శకుడు జాన్‌పాల్ జార్జ్ మరోసారి కాంబినేషన్ సెట్ అయింది.
మాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టొవినో థామస్, దర్శకుడు జాన్‌పాల్ జార్జ్ మరోసారి కాంబినేషన్ సెట్ అయింది. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘గుప్పి’ విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. ‘గుప్పి’ తర్వాత టొవినో థామస్ తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. విభిన్న కథలు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్‌ను పెంచుకున్నారు.
జాన్‌పాల్ జార్జ్ దర్శకుడిగానే కాకుండా నిర్మాతగానూ పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత టొవినోతో కలిసి మరోసారి సినిమా చేయనుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ కొత్త చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘గుప్పి’లో టొవినోతో కలిసి నటించిన చేతన్ జయలాల్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారు. ఈ సినిమాను తమిళం, మలయాళం భాషల్లో రూపొందించనున్నారు. ఈ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను మేకర్స్ ఇంకా వెల్లడించాల్సి ఉంది.