ఎద్దులా పరిగెడుతున్నా.. ఫహద్ ఫాజిల్ భార్య సంచలన పోస్ట్

ABN , Publish Date - Jun 16 , 2026 | 09:42 PM

మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazria Nazim) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే సుందరానికీ చిత్రంతో తెలుగు కుర్రకారు గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.

Nazriya Fahadh

మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ (Nazria Nazim) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంటే సుందరానికీ చిత్రంతో తెలుగు కుర్రకారు గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక నజ్రియా.. స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్‌ (Fahad Faasil) భార్య అన్న విషయం కూడా అందరికీ తెల్సిందే. నిత్యం ఆమె ఫహాద్ తో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'ఎద్దులు ఎర్రటి జెండాల వెనుక పరిగెడితే పిచ్చిదనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేను కూడా అదే పొరపాటు చేస్తున్నా' అని అర్దం వచ్చే పోస్ట్ ను ఆమె షేర్ చేసింది. దీంతో నజ్రియా - ఫహాద్ మధ్య ఏం అయ్యిందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

సాధారణంగా రిలేషన్‌షిప్‌లో నెగిటివ్ క్వాలిటీస్ లేదా డేంజర్ సైన్స్‌ని చూపెట్టడానికి సోషల్ మీడియాలో రెడ్ ఫ్లాగ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతుంటారు. నజ్రియా ఈ రేంజ్ బోల్డ్ అండ్ సెటైరిక్ కోట్ పెట్టడంతో.. అసలు ఆమె వ్యక్తిగత జీవితంలో ఏమైనా జరిగిందా లేక ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా పెట్టిందా అనే చర్చ సోషల్ మీడియాలో జోరందుకుంది. గతంలో కూడా నజ్రియా ఒక పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేసింది. సినిమాలు మానేసి డిప్రెషన్ లో ఉన్నాను అని చెప్పడంతో.. ఈ జంట విడాకులు తీసుకుంటుందేమో అని అనుకున్నారు. కానీ, కొన్నిరోజుల తరువాత వీరిద్దరూ కలిసి కనిపించడంతో విడాకుల వార్తలకు చెక్ పడింది.

ఇక ఇప్పుడు సడెన్ గా నజ్రియా.. రెడ్ ఫ్లాగ్ అని ఎవరిని అన్నది.. ? ఫహాద్- నజ్రియా మధ్య విభేదాలు తలెత్తయా.. ? అని నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ఇక ఫహాద్ నటుడిగా.. నిర్మాతగా బిజీగా ఉన్నాడు. పుష్ప సినిమాతో ఆయనకు తెలుగులో కూడా మంచి గుర్తింపు లభించింది. మరి నజ్రియా చెప్పిన ఆ రెడ్ ఫ్లాగ్.. ఎవరు.. ? ఆమె ఎందుకు ఇలాంటి పోస్ట్ పెట్టింది .. ? అనేది తెలియాలంటే నజ్రియా నోరు విప్పాల్సిందే.

Updated Date - Jun 16 , 2026 | 09:43 PM