హీరోయిన్ గా మోహన్ లాల్ కూతురు.. ట్రైలర్ చూశారా
ABN , Publish Date - Aug 05 , 2026 | 07:02 PM
మోహన్‌లాల్, ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఇప్పటికే నటులుగా రాణిస్తుండగా, ఇప్పుడు విస్మయ కూడా అదే బాటలో పయనిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
మలయాళ చిత్రసీమలో తన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న స్టార్ హీరో మోహన్‌లాల్ (Mohanlal) కుటుంబం నుంచి మరొకరు వెండితెరకు పరిచయమవుతున్నారు. ఆయన కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (Vismaya Mohanlal) తొడక్కం (Thudakkam) అనే యాక్షన్ థ్రిల్లర్ చిత్రంతో కథానాయికగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది. మోహన్‌లాల్, ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ ఇప్పటికే నటులుగా రాణిస్తుండగా, ఇప్పుడు విస్మయ కూడా అదే బాటలో పయనిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సౌత్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
2018 వంటి ఇండస్ట్రీ హిట్ ని అందించిన ప్రముఖ దర్శకుడు జూడ్ ఆంటోనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రశాంతమైన కుటుంబ కథగా ప్రారంభమై.. అనూహ్యంగా ఉత్కంఠభరితమైన యాక్షన్ థ్రిల్లర్‌గా మారే కాన్సెప్ట్‌తో తొడక్కం తెరకెక్కినట్లు తెలుస్తోంది. తండ్రీకూతుళ్ల బాండింగ్ ఈ చిత్రంలో అద్బుతంగా చూపించినట్లు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ఎంతో ప్రేమగా పెరిగిన ఒక యువతి.. అనుకోకుండా ఒక చిన్న తప్పు చేయడంతో కుటుంబం దూరం పెడుతుంది. అసలు ఆ యువతి చేసిన తప్పేంటి.. ? ఆ తండ్రీ ఏం చేశాడు.. అనేది సినిమా చూసే తెలుసుకోవాలి .
ఇక ఈ సినిమాలో విస్మయ మోహన్‌లాల్‌తో పాటు సీనియర్ నటుడు సాయికుమార్, ఆశిష్ జో ఆంటోనీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో మోహన్‌లాల్ కూడా ఒక ప్రత్యేక క్యామియో రోల్‌లో అలరించబోతుండటం విశేషం. ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ద్వారా విస్మయ నటిగా ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.