మరో స్టార్ హీరో విడాకులు.. ఏడాది తరువాత రివీల్

ABN , Publish Date - Sep 13 , 2026 | 03:40 PM

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. అంతకంటే వేగంగా విడాకులు కూడా జరిగిపోతున్నాయి. తమకు పడట్లేదని భావిస్తే స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు క్షణాల్లో విడాకులు ప్రకటించడం ఈమధ్య సర్వసాధారణమైపోయింది.

Sreenath Bhasi

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ప్రేమలు, పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో.. అంతకంటే వేగంగా విడాకులు కూడా జరిగిపోతున్నాయి. తమకు పడట్లేదని భావిస్తే స్టార్ హీరోల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు క్షణాల్లో విడాకులు ప్రకటించడం ఈమధ్య సర్వసాధారణమైపోయింది. తాజాగా ఇదే క్రమంలో మరో ప్రముఖ మలయాళ నటుడు తన పదేళ్ల వైవాహిక బంధానికి అధికారికంగా విడాకులు ప్రకటిస్తూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించాడు. ఏడాది క్రితమే విడిపోయినా.. ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించి షాక్ ఇచ్చాడు.


మలయాళంలో విభిన్నమైన పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనాథ్ భాసి. కుంబళంగి నైట్స్, భీష్మ పర్వం, మన్షుమ్ మోహన్ లాల్.. తెలుగులో కూడా బ్లాక్‌బస్టర్ అందుకున్న మంజుమ్మెల్ బాయ్స్ వంటి సినిమాల్లో తన నటనతో మెప్పించాడు శ్రీనాథ్. విలక్షణమైన మేనరిజమ్‌తో సౌత్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఆయన, తాజాగా తన రాబోయే చిత్రం అవరచన్ అండ్ సన్స్ సినిమా ప్రమోషన్లలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి షాకింగ్ విషయాలను బయటపెట్టాడు


శ్రీనాథ్ భాసి తన భార్య రీతు జకరియాతో విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ధ్రువీకరించాడు. తమ ఇద్దరి మధ్య కొన్ని అభిప్రాయభేదాలు రావడంతో గత ఏడాదిలోనే పరస్పర సమ్మతితో వేరుపడ్డామని ఆయన తెలిపాడు. 2016లో వివాహం చేసుకున్న ఈ జంట, అంతకుముందు కూడా చాలా ఏళ్లు స్నేహితులుగా ఉన్నారు. పది సంవత్సరాల సుదీర్ఘమైన అనుబంధం తర్వాత ఇలా విడిపోవడం ఎంతో బాధాకరమే అయినప్పటికీ, జీవితంలో ముందుకు సాగక తప్పడం లేదని భావోద్వేగానికి గురయ్యాడు.


ప్రస్తుతం తాను విడాకుల అనంతరం తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు శ్రీనాథ్ భాసి వెల్లడించాడు. ఈ క్లిష్ట సమయంలో తల్లిదండ్రుల మద్దతు తనకు కొండంత ధైర్యాన్ని ఇచ్చిందని, కేవలం సన్నిహితులకు మాత్రమే తెలిసిన ఈ విడాకుల విషయం ఇప్పుడు ప్రమోషన్లలో బయటకు రావడంతో ఇండస్ట్రీ వర్గాలు, అభిమానులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Updated Date - Sep 13 , 2026 | 03:40 PM