Odiyan: మలయాళ చిత్రసీమలోకి కరణ్‌ జోహార్‌

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:14 PM

పృథ్వీరాజ్‌ సుకుమారన్, మంజూ వారియన్ కీలక పాత్రలు పోషించబోతున్న 'ఓడియన్' మూవీతో కరణ్‌ జోహార్‌ మలయాళ చిత్రసీమలోకి అడుగు పెడుతున్నారు.

Karan Johar

ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ (Karan Johar) ఇప్పుడు మలయాళ చిత్రసీమపై దృష్టిపెట్టారు. మలయాళంలో రూపుదిద్దుకోబోతున్న 'ఓడియన్‌' సినిమాకు ఆయన నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. పృథ్వీరాజ్‌ సుకుమారన్ ఈ సినిమాకు మరో నిర్మాత. అలానే పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran) తో పాటు ఈ సినిమాలో మంజూ వారియర్ కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. 'ఓడియన్‌' మూవీని గతంలో 'భూతకాలం, భ్రమయుగం, డీయస్ ఈరే' చిత్రాలను రూపొందించిన రాహుల్‌ సదాశివన్ తెరకెక్కిస్తున్నారు.


SnapInsta-Ai_3920578336616816877.jpg

మలయాళ సినిమా రంగంపై తనకు మొదటి నుంచి ఎంతో గౌరవం ఉందని, ఆ రంగంలోకి ఇప్పుడు తమ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ అడుగు పెడుతోందని కరణ్‌ జోహార్ పేర్కొన్నారు. పృథ్వీరాజ్‌ సుకుమార్‌తో కలిసి సుదీర్ఘ ప్రయాణం చేయాలన్నది తన అభిలాష అని కరణ్ జోహార్‌ పేర్కొన్నారు. నిజానికి పృథ్వీరాజ్, కరణ్‌ జోహార్‌ గతంలోనూ కలిసి సినిమాలు చేశారు. మలయాళ చిత్రం 'డ్రైవింగ్‌ లైసెన్స్' హిందీ రీమేక్‌ 'సెల్ఫీ'ని 2023లో కరణ్‌, పృథ్వీరాజ్‌ కలిసి నిర్మించారు. అలానే కరణ్‌ జోహార్‌ ఓటీటీ మూవీ 'సర్జమీన్‌'లో పృథ్వీరాజ్‌ సుకుమారన్ నటించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాలను తెరకెక్కించిన రాహుల్‌ సదాశివన్ లేటెస్ట్ ప్రాజెక్ట్ 'ఓడియన్‌: ది ఏజ్‌ ఆఫ్‌ ఇల్యూజన్‌' (Odiyan: The Age of Illusion) పైనా కరన్‌ జోహార్‌ భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోదీ వీడియోలో.. అల్లు అర్జున్‌ AA23 థీమ్.. దేశవ్యాప్తంగా వైరల్

తల్లి కాబోతున్న సమంత..

Updated Date - Jun 17 , 2026 | 05:15 PM