ప్రేమలు 2.. ఏడాది వేస్ట్ అన్న డైరెక్టర్
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:47 PM
మలయాళంలోనే కాదు తెలుగులో కూడా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ప్రేమలు (Premalu) చిత్రం. నేస్లేన్, మమితా బైజు జంటగా గిరీష్ ఏ.డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రేమలు 2 ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు.
మలయాళంలోనే కాదు తెలుగులో కూడా సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది ప్రేమలు (Premalu) చిత్రం. నేస్లేన్, మమితా బైజు జంటగా గిరీష్ ఏ.డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ప్రేమలు 2 ని కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే కొన్ని కారణాల వలన ఈ సీక్వెల్ ఆగిపోయింది. దానికి కారణం నేస్లేన్ కి ఈ సీక్వెల్ కథ నచ్చకపోవడమే అని టాక్. ఇక ప్రేమలు తరువాత గిరీష్ ఏ.డి బెత్లహేమ్ కుటుంబ యూనిట్ (Bethlehem Kudumba Unit)ని తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది.
తాజాగా బెత్లహేమ్ కుటుంబ యూనిట్ సక్సెస్ మీట్ లో గిరీష్ ప్రేమలు 2 గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రేమలు సినిమా సాధించిన అఖండ విజయంతో వెంటనే సీక్వెల్ పనులను ప్రారంభించామని, అయితే ఎటువంటి సరైన కారణం లేకుండా అనూహ్యంగా ఆ చిత్రాన్ని పక్కన పెట్టాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఈ ప్రాజెక్ట్ కోసం తాము ఒక పూర్తి సంవత్సరం పాటు కష్టపడ్డామని, ఆ తర్వాత దానిని నిలిపివేయడం వల్ల ఏడాది కాలం పాటు పడిన శ్రమంతా వృథా అయిపోయిందని వాపోయాడు. అసలు ఆ సినిమాను ఆపేయాల్సిన అవసరమే రాలేదని గిరీష్ స్పష్టం చేశాడు.
ప్రేమలు 2 ప్రాజెక్ట్ రద్దు కావడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని, ఆ డిప్రెషన్ నుండి బయటపడేందుకు తాను ఎంతో ఇష్టపడి రాసుకున్న బెత్లహేమ్ కుటుంబ యూనిట్ కథను పట్టాలెక్కించానని తెలిపాడు. ఊహించని విధంగా ఈ కొత్త సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఊరటనిచ్చిందని, సంతోషాన్ని తెచ్చిపెట్టిందని ఆయన సక్సెస్ మీట్లో వెల్లడించాడు. ఏదేమైనా ప్రేమలు 2 వంటి మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ఆగిపోవడం అటు మాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రియులను కూడా నిరాశపరుస్తోంది.